/rtv/media/media_files/2024/11/08/jotlz6lNpaWXpQ2dv67x.jpg)
Life Style: సిగరెట్లపై వార్నింగ్ లేబుల్స్ ఉన్నట్లే.. మనం ఎంతో ఇష్టంగా తినే సమోసాలు, జిలేబీలు, లడ్డూలు, పకోడీ వంటి చిరుతిండ్లపై పై కూడా వార్నింగ్ లేబుల్ కనిపించే రోజు త్వరలోనే రాబోతుంది. బండ్లపై టెంప్టింగ్ గా కనిపించే సమోసాలు,జిలెబీలు , పకోడాలని వెంటనే పొట్టలోకి తోసేయాలని అందరికీ అనిపిస్తుంది! ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ నోటికి ఎంత రుచిగా ఉంటాయో, ఆరోగ్యానికి కూడా అంతే హాని కలిగిస్తాయి. వీటి వల్ల ఊబకాయం సమస్యలు కూడా బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక కొత్త చర్యను చేపట్టింది.
Also Read : రొమాంటిక్ గా మారిన ప్రియదర్శి.. 'ప్రేమంటే' ఫస్ట్ లుక్
ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త చర్య
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడానికి అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో తమ క్యాంటీన్‌లలో, పబ్లిక్ ప్రదేశాలలో "ఆయిల్ అండ్ షుగర్ బోర్డులు" ఏర్పాటు చేయాలని కోరింది. ఇవి మనం తినే స్నాక్స్ లో ఎంత కొవ్వు, నూనె, చక్కెర ఉన్నాయో చూపిస్తాయి. జనాలు ఇష్టంగా తినే ఈ సమోసా, జిలేబీ, పకోడా వంటి వాటిలో ఎన్ని కేలరీలు, ఎంత కొవ్వు దాగి ఉందో ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ చర్య ప్రధాన లక్ష్యం! అంతేకాదు ఈ అవగాహన కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫిట్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇస్తుంది. అలాగే ప్రజలు ఆరోగ్యకరమైన జీవశైలిని గడపడానికి, నూనె వినియోగాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతోపాటు ఈ లేబుల్స్ ప్రజల ఆహార ఎంపికను గుర్తుచేస్తాయని అధికారుల అభిప్రాయం.
Also Read : లంగావోణీలో రాశి అందాలు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా?
Also Read : లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త!
ఇది ఎందుకు అవసరం?
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇండియాలో ఊబకాయంతో బాధపడేవారు సంఖ్య ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఇది చాలా అవసరమైన చర్యకు వారు భావిస్తున్నారు. ఈ ఆహారపు అలవాట్లు ఇలాగే కొనసాగితే 2050 నాటికీ 44.9 కోట్లకు ఇండియన్స్ అధిక బరువు, ఊబకాయంతో బాధపడతారని నిపుణుల అంచనా! ఇదే జరిగితే ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్యలో అమెరికా తర్వాత భారత్ రెండవ స్థానంలో నిలుస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు.
AIIMS నాగ్‌పూర్ వంటి ప్రదేశాలలో, త్వరలో ఫుడ్ కౌంటర్ల దగ్గర, క్యాంటీన్లలో, స్నాక్స్ అందించే ఇతర ప్రదేశాలలో ఫుడ్ లేబుల్స్ ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. "ఆయిల్ అండ్ షుగర్ బోర్డులు" పెట్టడం ద్వారా ప్రజలు తాము ఎన్ని కేలరీలు, ఎంత ఫ్యాట్ తీసుకుంటున్నారో వారికి అవగాహన ఉంటుందని అధికారులు తెలిపారు. ఇది వారి ఆరోగ్య సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది.
Also Read: Kota Srinivasa Rao: ''చచ్చేదాక నటించాలి''.. కోట మాటలు వింటే కన్నీళ్లు ఆగవు!
samosa | jilebi | latest-telugu-news | today-news-in-telugu | healthy life style | daily-life-style | human-life-style