/rtv/media/media_files/2025/06/08/1x1dD6DBufTAdhzFWWfG.jpg)
kamal haasan and director shankar Indian 3 movie direct Release on ott soon
స్టార్ దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్ 2’ సినిమా ఎంతటి డిజాస్టర్‌గా మిగిలిందో అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ వద్ద దారుణమైన టాక్‌ను అందుకుంది. ఈ సినిమా పట్టాలెక్కి 3 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో భారీ అంచనాలను అందుకుంది. కానీ బొమ్మ పడేసరికి మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేసింది.
ఇక ఈ దెబ్బ నుంచి కోలుకోకముందే శంకర్ దర్శకత్వం వహించిన మరో సినిమా ‘గేమ్ ఛేంజర్’ కూడా ప్రేక్షకులను అలరించలేక సత్తకిల్లపడింది. ఈ మూవీ కూడా ప్రారంభమైన 3 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన మొదటి సినిమా ఇదే కావడంతో అందరిలోనూ మంచి రెస్పాన్స్ ఉండేది. కానీ ఇది కూడా తెరపై బొమ్మ పడిన తర్వాత దారుణమైన టాక్‌ను చవిచూసింది.
Also Read : ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి
Also Read : అనంతపురంలో ఇంటర్ విద్యార్థినీ దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు
డైరెక్ట్ ఓటీటీలోకే
రెండు సినిమాల్లోనూ దర్శకుడు శంకర్ స్టోరీ పాత చింతకాయపచ్చడిలా ఉందని నెట్టింట ట్రోల్స్ కూడా ఆ మధ్య వైరల్ అయ్యాయి. దీంతో అందరిలోనూ శంకర్‌పై నమ్మకం పూర్తిగా దెబ్బతీసింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో శంకర్ ‘ఇండియన్ 3’ రిలీజ్ పై అందరిలోనూ డౌన్ నెలకొంది. ‘ఇండియన్ 2’ ఘోర పరాజయంతో పార్ట్ 3 రిలీజ్ విషయంలో మేకర్స్ కాస్త వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఇండియన్ 3’ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి బదులుగా ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందు కోసం ఒక ఓటీటీ సంస్థకు అమ్మేందుకు ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో.
Also Read: మద్యం తాగడం అనే పొరపాటు చేయకండి! మీ కాలేయం పాడైపోతుంది.. ఫ్రూఫ్ ఇదే!
indian-2 | Kamal Hassan | indian 3 release | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news