Badshah: ఆమెతో పిల్లల్ని కనాలని ఉంది! బాలీవుడ్ ర్యాపర్ నోటి దూల! తిట్టిపోస్తున్న నెటిజన్లు

బాలీవుడ్ ర్యాపర్ బాద్‌షా బ్రిటీష్ సింగర్ దువా లిపాతో పిల్లల్ని కనాలని ఉంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కున్నాడు. 40 ఏళ్ల వ్యక్తి,, ఒక కూతురికి తండ్రి.. ఇలాంటి మాటలు మాట్లాడడమేంటి అని అసహనం వ్యక్తం చేశారు.

New Update
Rapper Badshah British singer Dua Lipa controversy

Rapper Badshah British singer Dua Lipa controversy

Rapper Badshah: బాలీవుడ్ ర్యాపర్ బాద్‌షా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శల పాలయ్యారు. బ్రిటీష్ సింగర్ దువా లిపాతో పిల్లల్ని కనాలని ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయి. అయితే రీసెంట్ గా ఎక్స్ లో సింగర్  'దువా లిపా' పై ప్రశంసలు కురిపిస్తూ ఓ హార్ట్ ఇమేజీని షేర్ చేశాడు. కాగా, ఈ పోస్ట్ కింద ఓ అభిమాని.. ''దువా లిపాతో కలిసి ఏదైనా మ్యూజిక్ కొలాబరేషన్ ప్లాన్ చేస్తున్నారా''  అని కామెంట్ పెట్టాడు.

Also Read: జనగణన ఆలస్యం.. మోదీ సర్కార్‌పై స్టాలిన్‌ సంచలన ఆరోపణలు

నెటిజెన్ల ట్రోలింగ్

దీనికి బాద్‌షా .. ''నేను ఆమెతో పిల్లల్ని కంటాను బ్రో" అని సమాధానం ఇచ్చారు. దీంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కున్నాడు. చాలా మంది దీనిని "అసహ్యకరమైనది", "అనుచితమైనది" అంటూ ఆయనపై మండిపడ్డారు. "బరువు తగ్గడంతో పాటు మెదడు కూడా పోయినట్టుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా..  మరొకరు "నువ్వు ఒక ర్యాపర్ నుంచి నేరస్థుడిగా మారడానికి ఒక ట్వీట్ దూరంలో ఉన్నావు అంటూ తెగ ట్రోల్ చేశారు.  40 ఏళ్ల వ్యక్తి,, ఒక కూతురికి తండ్రి..  ఇలాంటి మాటలు మాట్లాడడమేంటి అని అసహనం వ్యక్తం చేశారు. 

Also Read: గృహ హింస బాధితురాలికి రూ.కోటి పరిహారం ఇవ్వాలన్న కోర్టు

Also Read: పర్సు కొట్టేసిన కోతి...పర్సులో రూ.20 లక్షల విలువైన నగలు..తర్వాత ఏం జరిగిందంటే..

గతంలో కూడా  బాద్‌షా   బాద్‌షా తన "వెల్వెట్ ఫ్లో" ఆల్బమ్ లో  క్రైస్తవ మత మనోభావాలను దెబ్బతీశాడనే ఆరోపణలను ఎదుర్కున్నాడు. ఈ నేపథ్యంలో పంజాబ్ లో ఆయన పై కేసు కూడా నమోదైంది. ఈ పాటలో చర్చి, బైబిల్ వంటి పదాలను అగౌరవంగా ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదంపై బాటాలాలో నిరసనలు కూడా జరిగాయి.

Also Read: Shambhala Teaser: ఆ అంతుచిక్కని రహస్యం ఏంటి?.. ఫుల్ మిస్టరీ గా 'శంభాలా' టీజర్

 

singer Dua Lipa

Advertisment
Advertisment
తాజా కథనాలు