/rtv/media/media_files/2025/04/21/Xq4cp9G0oWNaEZUf5w5j.jpg)
Hebah Patel
కొన్నిసార్లు సెలబ్రిటీల వ్యాఖ్యలు చర్చకు దారితీస్తాయి. మరికొన్ని సందర్భాలలో మరీ ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అనే భావన కలిగిస్తాయి. తాజాగా నటి హెబ్బా పటేల్ చేసిన వ్యాఖ్యలు కూడా రెండో కోవకే చెందుతుంది అనిపిస్తోంది. ఆమె తాజా హెబ్బా మాట్లాడుతూ, తాను ఇంకా పదేళ్లపాటు సినీ పరిశ్రమలో కొనసాగబోతున్నట్లు చెప్పారు. ఈ మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read: మోహన్‌లాల్‌తో మాళవిక ‘హృదయపూర్వం’..
ఒక్కప్పుడు గ్లామర్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న హెబ్బా, గత కొంతకాలంగా మాత్రం తన కెరీర్‌లో కొంచెం వెనకపడ్డారనే చెప్పాలి. ఆమె చివరగా నటించిన ‘ఓదెల-2’ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. అంతేకాదు, ఈ సినిమాలో తన కన్నా ఎక్కువ మార్కులు తమన్నా కొట్టేసింది.
Also Read: 'కింగ్‌డమ్' నుంచి క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్ లోడింగ్..!
"ఇంకా పదేళ్లు సినిమాల్లో ఉంటా"
ఈ నేపథ్యంలో హెబ్బా చేసిన "ఇంకా పదేళ్లు సినిమాల్లో ఉంటా" అన్న కామెంట్ కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే, సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు కెరీర్ స్పాన్ చాలా చిన్నది. ట్రెండ్, మార్కెట్ ని బట్టి పరిస్థితులు మారిపోతాయి. అయితే హెబ్బా అంతకాలం ఇండస్ట్రీలో కొనసాగుతానన్న ధీమా వ్యక్తం చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చగా మారింది.
Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..?
ప్రస్తుతం 37 ఏళ్ల వయసులో ఉన్న హెబ్బా, ఒకప్పుడు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నా, ఇప్పుడు చాలా వరకు ఫేడ్ అవుట్ అయినట్టే కనిపిస్తుంది. పరిశ్రమలో ఒక్కటే సూత్రం సక్సెస్ ఉన్నవారికే అవకాశాలు కలిసివస్తాయి. ఈ వాస్తవం దృష్టిలో ఉంచుకుంటే మంచిది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..
latest-telugu-news | today-news-in-telugu | telugu-news | telugu-cinema-news | telugu-film-news | tollywood-news-in-telugu | Tollywood news updates | Hebah Patel