Kingdom: 'కింగ్‌డమ్' నుంచి క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్‌ లోడింగ్..!

విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్‌డమ్’ నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రానుంది. టీజర్‌ రిలీజ్ చేసిన తర్వాత ఈ సినిమా నుండి ఒక్క అప్డేట్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయితే, మే 20న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు.

New Update
Kingdom

Kingdom

Kingdom: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ప్రస్తుతం ‘కింగ్‌డమ్’ అనే భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, సూర్య దేవర నాగవంశీల నిర్మాణంలో రూపుదిద్దుకుంటోంది. స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చుతున్నారు.

Also Read:xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే..?

ఫిబ్రవరిలో విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ మాస్ లుక్, పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఫ్యాన్స్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి. అయితే టీజర్ తర్వాత సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ కొంచెం డిస్సపాయింట్ అయ్యారు. అంతేకాకుండా.. షూటింగ్ ఆగిపోయిందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో ఫ్యాన్స్ లో ఆందోళన మొదలయింది.

Also Read:అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..

త్వరలోనే ‘కింగ్‌డమ్’ ఫస్ట్ సింగిల్‌

అయితే, తాజాగా చిత్ర బృందం నుండి ఎట్టకేలకు ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. చిత్ర నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. త్వరలోనే ‘కింగ్‌డమ్’కి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను(Kingdom First Single) విడుదల చేయనున్నట్టు తెలిపారు. పాటకు సంబంధించి అనౌన్స్‌మెంట్ ఈ వారంలోనే రానుండగా, పాటను కూడా ఇదే వారంలో విడుదల చేయాలన్న ప్లాన్‌లో ఉన్నారు.

Also Read:ఫ్యాన్స్‌ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..

ఈ వార్తతో విజయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. అయితే, 'కింగ్‌డమ్' సినిమాను మే 20న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా విజయ్ కెరీర్‌లో మరో హిట్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 

Also Read:'రాబిన్ హుడ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Advertisment
తాజా కథనాలు