Malavika Mohanan: మోహన్‌లాల్‌తో మాళవిక ‘హృదయపూర్వం’..

మోహన్‌లాల్‌తో కలిసి మాళవిక మోహనన్ ‘హృదయపూర్వం’ చిత్రంలో నటిస్తోంది. పుణెలో షూటింగ్ జరుపుతున్న ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం ఫస్ట్ లుక్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు మాళవిక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు.

New Update
Malavika Mohanan

Malavika Mohanan

Malavika Mohanan: వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న నటి మాళవిక మోహనన్‌, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. మలయాళ లెజెండరీ హీరో మోహన్‌లాల్‌తో(Mohanlal) కలిసి ‘హృదయపూర్వం’(Hrudayapoorvam) అనే చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సత్యన్‌ అంతికాడ్‌ మెగాఫోన్ పట్టారు.

Also Read: 'కింగ్‌డమ్' నుంచి క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్‌ లోడింగ్..!

పుణెలో ‘హృదయపూర్వం’ షూటింగ్

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పుణే నగరంలో జోరుగా సాగుతోంది. తాజా అప్‌డేట్‌ను మాళవిక స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. షూటింగ్‌కు సంబంధించిన ఓ బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేస్తూ, “గత రెండు వారాలుగా పుణెలో షూటింగ్ చేస్తున్నాం. ఇది ఓ సవాళ్లతో నిండిన ప్రయాణమే అయినా, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ‘హృదయపూర్వం’ టీమ్‌తో కలిసి ప్రేక్షకులకు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడానికి మేము కృషి చేస్తున్నాం. త్వరలో థియేటర్లలో కలుద్దాం,” అంటూ తన భావాలను షేర్ చేసింది.

Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే..?

ఈ చిత్రం ఒక హృదయస్పర్శక కుటుంబ కథా చిత్రం (ఫ్యామిలీ డ్రామా)గా రూపొందుతోంది. ప్రేక్షకులను మానసికంగా కట్టిపడేసే ఎమోషనల్ కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్‌ను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..

Also Read: ఫ్యాన్స్‌ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..

Advertisment
Advertisment
తాజా కథనాలు