Grok Memory Feature: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే..?

ఎలాన్ మస్క్ xAI సంస్థ గ్రోక్‌కి మెమరీ ఫీచర్ అందించింది. ఇది వినియోగదారుల సమాచారాన్ని గుర్తుంచుకుని వ్యక్తిగత ప్రతిస్పందనలు ఇస్తుంది. మెమరీను యూజర్లు తొలగించే వీలు కూడా ఉంది. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్‌లో grok.com, iOS, Android యాప్‌లలో అందుబాటులో ఉంది.

New Update
Grok Memory Feature

Grok Memory Feature

Grok Memory Feature: ఎలాన్ మస్క్(Elon Musk) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ xAI, తన చాట్‌బాట్ "గ్రోక్" కు ఒక కొత్త మెమరీ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ తాజా ఫీచర్‌ ద్వారా, గ్రోక్ గత సంభాషణల వివరాలను గుర్తుంచుకుంటూ, ప్రతి వినియోగదారుడికి ప్రత్యేకమైన, వ్యక్తిగత ప్రతిస్పందనలు అందించగలదు. దింతో, గ్రోక్ తన పోటీదారులైన OpenAI యొక్క CHATGPT, Google యొక్క GeminiAIలతో పోటీ పడనుంది.

Also Read: మరో 5 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు!

గ్రోక్ మెమరీ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

గ్రోక్ నూతన మెమరీ ఫీచర్ వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు వంటి వివరాలను గుర్తుంచుకునేలా రూపొందించారు. తద్వారా, సమయానుగుణంగా మరింత అనుకూలమైన సలహాలు, సమాధానాలను అందించగలదు. వినియోగదారులు గ్రోక్ ఏం గుర్తుంచుకుంటుందో స్పష్టంగా చూడవచ్చు, అలాగే అవసరమైనప్పుడు మనకు కావాల్సిన మెమరీ ఉంచుకొని, వద్దు అనుకున్న మెమరీలను డిలీట్ చేయొచ్చు.

Also Read: కొడుకులు పారిపోతున్నా కొబ్బరి బోండాల కత్తితో నరికి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో grok.com వెబ్‌సైట్‌,  iOS, Android యాప్‌లలో అందుబాటులో ఉంది. అయితే, ఇది యూరోప్ యూనియన్, యునైటెడ్ కింగ్‌డమ్‌ (UK) దేశాల్లో మాత్రం ఇంకా అందుబాటులో లేదు.

Also Read: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్‌ టికెట్లు!

xAI సంస్థ వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. వినియోగదారులు సెట్టింగ్స్‌లోని Data Controls పేజీ ద్వారా ఈ మెమరీ ఫీచర్‌ను పూర్తిగా ఆఫ్ చేయవచ్చు. అలాగే, చాట్ ఇంటర్‌ఫేస్ నుండే వ్యక్తిగత మెమరీలను తొలగించే వీలూ ఉంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా గ్రోక్ మనిషికి మరింత దగ్గర కానుంది. ఇది AI చాట్‌బాట్ టెక్నాలజీలో ఒక ముందడుగు అనే చెప్పవచ్చు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు