/rtv/media/media_files/2025/04/19/f2VHPvNgIbYcliX83DN7.jpg)
Prabhas- Anushka Ai
Prabhas- Anushka Ai: టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ప్రభాస్. వయసు 45 దాటినా ఇప్పటివరకు పెళ్లి చేసుకోని ప్రభాస్ ఇప్పటికీ బ్యాచిలర్‌గానే ఉన్నాడు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే అనుష్క కూడా పెళ్లికి దూరంగా ఉంటుంది. వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన సంబంధం ఉందంటూ కొన్ని గాసిప్స్ సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూ ఉంటాయి.
Also Read: ఐదేళ్ల తర్వాత మానస సరోవర యాత్రకు ఓకే..భారత, చైనా సంబంధాల్లో కీలక మలుపు
‘మిర్చి’ సినిమాలో కలిసి నటించిన తర్వాత ప్రభాస్, అనుష్క జంటపై అభిమానుల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. తెరపై వీరి కెమిస్ట్రీ చూసినవాళ్లందరూ ఆఫ్‌స్క్రీన్‌లో కూడా వీరి బంధం ప్రేమగా మారుతుందేమోనని ఊహించారు. అయితే వీరి మధ్య రిలేషన్‌షిప్ ఉందన్న వార్తలపై ఇద్దరూ ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
Also Read: ఫ్యాన్స్ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..
ప్రభాస్- అనుష్క ఏఐ ఫొటోలు వైరల్
ఇటీవల ప్రభాస్, అనుష్క కలిసి ఉన్నట్లు చెబుతూ కొన్ని ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఒక ఫొటోలో అనుష్క, ప్రభాస్‌ను ఆప్యాయంగా హగ్ చేసుకుంటున్నట్లు కనిపించగా, అవి నిజమేనని అనుకున్నారంతా... కానీ తర్వాత అవి కేవలం ఏఐ టూల్స్ ఉపయోగించి రూపొందించిన ఫేక్ ఇమేజ్ అని తేలింది.
Also Read: 'రాబిన్ హుడ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఈ ఫేక్ ఫొటోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఏఐని సాయంగా మంచి పనులు చేయండి కానీ ఇలా తప్పుడు సమాచారం ప్రసారం చేసే ఫేక్ ఫొటోలు తయారు చేయకండి’’ అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు.
Also Read: 'ది రాజా సాబ్' ఉన్నట్టా లేనట్టా..? త్వరగా తేల్చండ్రా బాబూ..!