Deepika Padukone: ప్రభాస్ ప్రాజెక్ట్స్ నుండి అందుకే తప్పుకున్నా: దీపికా పదుకొణె

దీపికా పదుకొణె Kalki 2898 AD సీక్వెల్, Spirit నుంచి తప్పుకోవడానికి కారణం డబ్బు, షెడ్యూల్ కాదని, ఆరోగ్యం, మంచి పని వాతావరణమే ముఖ్యమని తెలిపింది. భారీ బడ్జెట్, భారీ రెమ్యూనరేషన్ సినిమాలు తన నిర్ణయాలను ప్రభావితం చేయవని తెలిపింది.

New Update
Deepika Padukone

Deepika Padukone

Deepika Padukone: బాలీవుడ్‌ స్టార్‌(Bollywood Actress) దీపికా పదుకొణె ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న AA22xA6 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉంది. అయితే ఇటీవల ఆమె వరుసగా రెండు పెద్ద తెలుగు సినిమాల నుంచి తప్పుకోవడంతో పెద్ద చర్చ మొదలైంది. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న Kalki 2898 AD సీక్వెల్, Spirit.

Also Read: తన వాళ్ల కోసమే బ్రతికే మగ మహానుభావులందరికి హ్యాపీ మెన్స్ డే!!

Deepika Padukone Comments About Quitting Prabhas Sequel Movies

ఈ నిర్ణయంపై సోషల్ మీడియా(Social Media) లో వచ్చిన నెగటివ్ కామెంట్లకు స్పందిస్తూ, దీపికా తాజాగా Harper’s Bazaar ఇంటర్వ్యూలో అందుకు గల కారణాన్ని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ, ఈ సినిమాల నుంచి తప్పుకోవడం పారితోషికం, షెడ్యూల్, లేక సినిమా బడ్జెట్ కారణం కాదని స్పష్టం చేసింది.

దీపికా మాటల్లో.. “ఇప్పుడు నాకు 100 కోట్లు, 500–600 కోట్ల సినిమా అనేది ఏ మాత్రం ముఖ్యం కాదు. ఏ పనిని ఎందుకు చేయాలి అనేది నాకు ఇప్పుడెక్కువ ముఖ్యం.”

పెద్ద సినిమాలు ఎంత కష్టమో కూడా ఆమె వివరించింది. “చాలా మంది ఎక్కువ డబ్బు ఇస్తే చాలు అనుకుంటారు. కానీ అంతే కాదు. మంచి పని వాతావరణం కూడా అవసరం. రోజుకు ఎనిమిది గంటలపాటు పనిచేయడం సరిపోతుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి అవుట్‌పుట్ ఇవ్వగలం” అని ఆమె చెప్పింది.

దీంతో ఆమె ఈ రెండు భారీ ప్రాజెక్టుల నుంచి తప్పుకున్న కారణం స్పష్టమైంది దీపికా తన ఆరోగ్యం, వ్యక్తిగతం, క్వాలిటీ అవుట్‌పుట్ ను ప్రాముఖ్యంగా చూసుకుంటోంది. పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్లు ఇప్పుడు ఆమె నిర్ణయాలను ప్రభావితం చేయడం లేదన్న మాట.

ఇక Spirit సినిమాలో దీపికా స్థానంలో త్రిప్తి డిమ్రి ఎంపికయ్యారు. అయితే Kalki 2898 AD సీక్వెల్‌లో ఆమె స్థానంలో ఎవరు నటిస్తారో ఇంకా ప్రకటించలేదు. ఈ విషయంలో మరిన్ని అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read :  కథ చెబుతానని పిలిచి ఆ డైరెక్టర్ బలవంతం చేసాడు: మౌనీ రాయ్

Advertisment
తాజా కథనాలు