/rtv/media/media_files/2025/11/19/international-mens-day-2025-2025-11-19-13-15-35.jpg)
International Mens Day 2025
International Men’s Day 2025: ప్రపంచ జనాభాలో పిల్లలు, యువకులు, పెద్దలు ఎక్కువ అధిగ సంఖ్యలో ఉంటారు. అన్ని వయసుల మగవారి కోసం కూడా ఒక ప్రత్యేక దినం ఉండాలనే ఆలోచన నుంచి పుట్టిందే 'అంతర్జాతీయ పురుషుల దినోత్సవం'(International Men's Day 2025). నవంబర్ 19న జరుపుకునే ఈ రోజు, మగవారు కుటుంబం, సమాజం కోసం చేసే కృషి, త్యాగాలు, బాధ్యతలను గుర్తుచేసే రోజు.
Also Read: ఏపీలో సంచలనం.. సిటీల్లోకి మావోయిస్టులు..పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక షెల్టర్లు
ఈ రోజు ప్రత్యేక సెలవు ఏమీ లేకపోయినా, దీని వెనుక ఉన్న ఉద్దేశాలు చాలా గొప్పవే. మగవారు రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడులు, మానసిక సమస్యలు, సామాజిక ఒడిదుడుకులపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చర్చలు జరుగుతాయి. అలాగే లింగ సమానత్వం, మగవారి హక్కులు, వారి ఆరోగ్యం భావోద్వేగాలపై అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా నిర్వహిస్తారు.
పురుషుల గురించి ఉన్న కొన్ని తప్పుడు భావనలు, ఉదాహరణకు "మగాళ్లు కఠిన స్వభావులు", "భావాలు వ్యక్తం చేయరు", "సహానుభూతి తక్కువ" వంటి అభిప్రాయాలను మార్చడమే ఈ దినోత్సవ ముఖ్య లక్ష్యం. మగవారి మంచి లక్షణాలు, సమాజానికి అందిస్తున్న సేవలు ప్రపంచానికి తెలియజేయటం కూడా ఈ దినోత్సవం ఉద్దేశాల్లో ఒకటి.
Also Read: తన వాళ్ల కోసమే బ్రతికే మగ మహానుభావులందరికి హ్యాపీ మెన్స్ డే!!
అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి ఐక్యరాజ్యసమితి మద్దతు ఇస్తోంది. యునెస్కో సహకారంతో ప్రపంచంలోని అనేక దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు, కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే అధికారికంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. సమాజంలో పురుషుల పాత్ర, వారి కృషిని గౌరవించే ప్రపంచ వేడుకగా మెన్స్ డే నిలుస్తోంది. ప్రతి సంవత్సరం నవంబర్ 19న జరుపుకునే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (International Men’s Day) 2025లో కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలతో జరుపుకుంటున్నారు. 2025లో కూడా ఈ దినోత్సవం నవంబర్ 19, బుధవారం జరగనుంది. ప్రతి సంవత్సరం ఇదే తేదీని పాటిస్తారు.
Also Read: శబరిమలలో ఏపీ భక్తులపై అమానుషం! ..ప్యాంట్ జిప్ విప్పి
ఈ సంవత్సరం థీమ్ - ‘Celebrating Men and Boys’
2025 థీమ్ "పురుషులు, యువకులను గౌరవిద్దాం".
- ఈ థీమ్‌లో ముఖ్యంగా
- కుటుంబం, ఉద్యోగం, సమాజంలో పురుషులు చేసే మంచి పనులను గుర్తించడం.
- మెంటల్ హెల్త్ పై అవగాహన పెంచడం
- మంచి రోల్ మోడల్స్‌ను ప్రోత్సహించడం
కొన్ని దేశాలు “Supporting Men and Boys”, అలాగే “Zero Male Suicide” వంటి ప్రత్యేక క్యాంపెయిన్‌లను కూడా నిర్వహిస్తున్నాయి.
Also Read: పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి.. బాబా జీవితం వసుదైక కుటుంబం..
మెన్స్ డే ఎలా ప్రారంభమైంది? International Men's Day 2025
1999లో ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి చెందిన డాక్టర్ జెరోమ్ టీలక్సింగ్ ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. తన తండ్రి పుట్టినరోజు, దేశంలో జరిగిన ఒక మంచి సంఘటనను గుర్తు చేసుకునేలా ఈ తేదీని ఎంచుకున్నారు. ప్రస్తుతం 80కి పైగా దేశాలు ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి.
మెన్స్ డే ఎందుకు ముఖ్యమైనది?
- అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఆరు ప్రధాన లక్ష్యాలతో సాగుతుంది
- సమాజానికి సేవ చేసే పురుషులను గౌరవించడం
- వారి శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం
- కుటుంబం, పిల్లల పెంపకం, సమాజ సేవలో వారి పాత్రను గుర్తించడం
- పురుషులు ఎదుర్కొనే సమస్యలను రాష్ట్రాలు, సమాజం పట్టించుకోవడం
- లింగ సమానతకు సహాయపడడం
- అబ్బాయిలకు మంచి అవకాశాలు అందేలా ప్రోత్సాహించడం
పురుషులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, నిస్సహాయత, ఆత్మహత్య వంటి సమస్యలు చాలాసార్లు దాచి పెట్టబడతాయి. అది ఈ రోజు మెంటల్ హెల్త్ గురించి బహిరంగ చర్చకు దారితీస్తుంది.
- స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు
- ఆఫీసుల్లో మెంటల్ హెల్త్ సెషన్‌లు
- సోషల్ మీడియా ప్రచారాలు
- సమాజ సేవలో ముందున్న పురుషులను సత్కరించడం
మెన్స్ డే vs ఉమెన్స్ డే
రెండు దినోత్సవాల లక్ష్యం లింగ సమానతే. కానీ పురుషులు, అబ్బాయిల ప్రత్యేక సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే ఈ రోజు లక్ష్యం. ఇంటర్నేషనల్ మెన్స్ డే 2025, పురుషులు, యువకుల పాత్రను గౌరవిస్తూ, వారి ఆరోగ్యం, భావోద్వేగాలు, మానసిక స్థితిపై అవగాహన పెంచే రోజు. సమానమైన, సానుకూల, అర్థవంతమైన సమాజం కోసం ఈ రోజు ఎంతో అవసరమైంది.
Follow Us