Tollywood : సంక్షోభంలో టాలీవుడ్.. రేపటి నుంచి షూటింగ్స్ బంద్!
తెలుగు ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. వేతనాలు 30% పెంచితేనే షూటింగ్స్లో పాల్గొంటామని ఫెడరేషన్ వెల్లడించింది. పెంచిన వేతనాలు ఏరోజు ఆరోజు ఇవ్వాలని డిమాండ్ చేసింది.