AP: రూ.500 కోసం ఆత్మహత్య చేసుకున్న దంపతులు
ఐదు వందలకోసం గొడవపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుడివాడలో చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన భర్త రాంబాబు భార్య కనకదుర్గను డబ్బులు కావాలని అడగడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రాంబాబు ఉరేసుకుని చనిపోగా ఆమె కూడా ఉరేసుకుని తనువు చాలించింది.