భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్లు గోవిందా!
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నిన్న భారీ నష్టాలతో ముగిశాయి. కేవలం నిన్న ఒక్క రోజు బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.9.19 లక్షల కోట్లు గాల్లో కలిసిపోయాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు, నిఫ్టీ 309 పాయింట్ల వరకు భారీగా నష్టపోయాయి.