/rtv/media/media_files/2025/04/11/95iQsgiewo986Df7hoy2.jpg)
Tesla Cybertruck
Tesla Cybertruck: టెస్లా కంపెనీ గురువారం(10 ఏప్రిల్ 2025) అమెరికాలో కొత్త సైబర్‌ట్రక్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ధర $69,990 (అంటే సుమారు రూ. 58 లక్షల వరకు)గా ఉంది.
ఈ కొత్తగా వచ్చిన సైబర్‌ట్రక్ మోడల్ టెస్లా కంపెనీ అందిస్తున్న మూడు మోడల్స్‌లో తక్కువ ధర కలిగిన వాహనం. ఇది “లాంగ్-రేంజ్ వేరియంట్” అని టెస్లా వెబ్‌సైట్ ప్రకారం తెలుస్తోంది.
Also Read: వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ధర వెరీ చీప్- ఫీచర్స్ కిర్రాక్!
ఈ మోడల్ ప్రత్యేకత ఏమిటంటే..
దీని బాటరీ సామర్థ్యం గత మోడల్స్ తో పోలిస్తే చాలా మెరుగ్గా శక్తివంతంగా ఉంటుంది. అంటే దీని సింగిల్ ఛార్జ్‌తో ఎక్కువ మైళ్ల దూరం ప్రయాణించగలదు. తక్కువ ఖర్చులో టెస్లా బెస్ట్ వెహికల్ కోరే వినియోగదారులకు ఈ కొత్త వెర్సన్ అనుకూలంగా ఉంటుంది.
Also Read: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి
ఇప్పటికే ఉన్న మిగతా రెండు మోడల్స్‌తో పోల్చితే, ఈ వాహనం ధర తక్కువగా ఉండటం వల్ల ఈ మోడల్ సేల్స్ పెరిగే అవకాశం ఉంది. ఈ కొత్త సైబర్‌ట్రక్ వెర్షన్ తో టెస్లా కంపెనీ మరింత మంది మార్కెట్ కస్టమర్లను ఆకర్షించాలనుకుంటోంది.
Also Read: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..
టెస్లా కంపెనీ సైబర్‌ట్రక్ మొదటిసారి అనౌన్స్ చేసినప్పుడు దాని డిజైన్, శక్తివంతమైన పనితీరు, భవిష్యత్తులో వాడే సాంకేతికతల వల్ల ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ కొత్త మోడల్ విడుదలతో టెస్లా తన ఉత్పత్తుల్లో సరసమైన ధరలో శక్తివంతమైన సైబర్‌ట్రక్ ను అందరికి అందించాలని భావిస్తోంది.
Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!