/rtv/media/media_files/2025/04/09/V64Fmxrr2YerY3SYTfEA.jpg)
Air India flight 123
ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బిజినెస్ క్లాస్‌లో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఎయిర్ ఇండియాకు చెందిన AI 2336 లోని బిజినెస్ క్లాస్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. ప్యాసింజర్ వికృత ప్రవర్తనకు ఫ్లైట్‌లో ప్రయాణికులందరూ అసహించుకున్నారు. అయితే జరిగిన దానికి ఆ వ్యక్తి క్షమాపణలు కోరాడు.
Also read: BIG BREAKING: ట్రంప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు
Whenever these kinds of incidents happen, the Ministry takes note of them. They will speak to the airline, and if there is any wrongdoing, then we will take necessary action: Civil Aviation Minister Ram Mohan Naidu Kinjarapu on an Indian national allegedly urinating on the MD of… pic.twitter.com/xwWBjCOFyu
— ANI (@ANI) April 9, 2025
Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి
ప్రయాణీకుడు బిజినెస్ క్లాస్‌లోని 2D సీటులో కూర్చుని సమీపంలో కూర్చున్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. బాధిత ప్రయాణీకుడు ఈ సంఘటనకు సంబంధించి ఇంకా ఫిర్యాదు చేయనప్పటికీ, నిందితుడు తన చర్యలకు క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సంస్థ అధికారులు తెలిపారు. పక్క వ్యక్తిపై యూరిన్ పోసిన ప్యాసింజర్ పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అట. దీనిపై బ్యాంకాన్ వెళ్లాక కంప్లెయింట్ ఇస్తానని బాధిత ప్రయాణికుడు ఫ్లైట్ సిబ్బందికి తెలిపారు.