BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

ట్రంప్ సుంకాల పెంపుతో చైనా కూడా అమెరికా మీద ప్రతీకార పన్నులు విధించింది. అమెరికాపై 84 శాతం టారీఫ్ ఛార్జీలు విధిస్తున్నట్లు చైనా ఆర్థిక శాఖ బుధవారం ప్రకటించింది. ఏప్రిల్ 10 నుంచి ఈ పన్నుల విధానం అమలులోకి రానుంది.

New Update
China tax on US

China tax on US

ట్రంప్ టారీఫ్ ఛార్జీల పెంపుతో చైనా, అమెరికాల మధ్య ట్రేడ్ వార్ ముదురుతోంది. గతంలో అమెరికా చైనాపై విధించిన దిగుమతి సుంకాలను భారీగా పెంచాడు. ఈ చర్యపై చైనా ట్రంప్‌కు వార్నింగ్ కూడా ఇచ్చింది. అమెరికాకు ఎగుమతి చేస్తున్న చైనా వస్తువులపై  104 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ తాజాగా ప్రకటించాడు. దీనికి ప్రతీకార చర్యగా చైనా కూడా అమెరికాపై టారిఫ్ ఛార్జీలు పెంచుతున్నట్లు బుధవారం బీజింగ్ నుంచి ప్రకటించారు.

84 శాతం వరకు సుంకాలను విధిస్తున్నట్లు గురువారం చైనా ఆర్థిక శాఖ తెలిపింది. ఇప్పటివరకు చైనాకు అమెరికా ఎగుమతి చేసిన వస్తువులపై 34 శాతం సుంకాలు విధించేది. ఇప్పుడు దాన్ని 84శాతానికి పెంచింది. ట్రంప్ సుంకాల పెంపుతో అనేక దేశాలు అమెరికా తీరుపై అసంతృప్తిగా ఉన్నాయి.

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

అమెరికా చైనాకు ఎగుమతి చేసే వస్తువుల కంటే.. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల విలువ ఎక్కువగా ఉంది. చైనాతో తమకు గణనీయమైన వాణిజ్య లోటు ఉందని అమెరికా చెబుతోంది. అమెరికా డేటా ప్రకారం.. 2024లో అమెరికాకు USD 440 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసింది. - ఇది చైనాకు అమెరికా ఎగుమతుల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఇది దాదాపు USD 145 బిలియన్లు.

Advertisment
Advertisment
తాజా కథనాలు