Egg prices: కోడిగుడ్డుకు రెక్కలు.. కోళ్లను అద్దెకు తెచ్చకుంటున్న అమెరికన్స్

అమెరికాలో బర్డ్ ఫ్లూ కారణంగా కోడి గుడ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. 2023 ఆగస్టులో డజను గుడ్లు 2.04 డాలర్లు (రూ.175) కాగా, 2025 మార్చిలో అది 6.23 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో 12 కోడిగుడ్లు కొనాలంటే రూ.536 చెల్లించాలి. ఒక్కో గుడ్డుకు రూ.44 లు పడుతుంది.

New Update
Egg prices

Egg prices

అగ్రరాజ్యంలో కోడిగుడ్ల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. సామాన్యులు కోడిగుడ్డు తినే పరిస్థితులు లేవు. గతకొన్ని నెలలుగా అమెరికాలో కోడిగుడ్ల ధరలు పెరుగుతూనే పోతున్నాయి. దీనికి బర్డ్ ఫ్లూ కూడా ఓ కారణమని అంచనా. 2023 ఆగస్టులో డజను గుడ్ల ధర 2.04 డాలర్లు (రూ.175) కాగా, 2025 మార్చిలో అది 6.23 డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో అయితే 12 కోడిగుడ్లు కొనాలంటే రూ.536 చెల్లించాలి. ఒక్కో గుడ్డుకు రూ.44 లు పడుతుంది. అమెరికాలో ప్రస్తుతం బర్డ్‌ ఫ్లూ కేసులు తగ్గుముఖం పట్టినా ఇంకా చికెన్, కోడిగుడ్ల రేట్లు అదుపులోకి రాలేదు.

Also read: Helicopter Crash: హెలికాఫ్టర్ క్రాషై కుటుంబ సభ్యులు మొత్తం మృతి

అమెరికాలో సాధారణంగా గుడ్ల ధరలు ఈస్టర్‌ దినమైన ఏప్రిల్‌ 20 వరకు పెరుగుతాయి. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తిని అరికట్టడానికి 2024 జనవరి, ఫిబ్రవరిలో 3 కోట్ల గుడ్లుపెట్టే కోళ్లను చంపేశారు. దీంతో కోడిగుడ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. బర్డ్‌ ఫ్లూ వచ్చినప్పటి నుంచి అమెరికాలో 16.80 కోట్ల కోళ్లను ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వధించారు. వీటిలో అత్యధికం గుడ్లు కోసం పెంచే కోళ్లే. చాలా కోళ్ల ఫారాలను శానిటైజ్‌ చేసి మళ్లీ మెల్లగా గుడ్ల ఉత్పత్తి ప్రారంభిస్తున్నారు. ఏది ఏమైనా అమెరికన్స్ ఎగ్స్ తినానంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. దీంతో కోళ్లను రెంటుకు తీసుకునే కల్చర్ అక్కడ ట్రెండ్ అవుతోంది. గుడ్లు పెట్టే కోళ్లను కొన్ని నెలలపాటు అద్దెకు తీసుకుంటున్నారు. కొన్ని గుడ్లు పెట్టేంతవరకు వాటిని పెంచుకొని తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇలా చేస్తే తక్కువ ధరకే కోడిగుడ్లు పొందుతున్నారు.

Advertisment
తాజా కథనాలు