Stock Market: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

నిన్నటి ఆసియా, అమెరికా మార్కెట్ల ఊపు ఇవాళ భారత స్టాక్ మార్కెట్లకు వచ్చింది. ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన 90 రోజుల పాస్..మార్కెట్లు ఎదుగుదలకు కారణమయింది. దీంతో ఈరోజు మన స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో రోజును ప్రారంభించాయి. 

New Update
stock market today

stock market today

ట్రంప్ టారీఫ్ల విరామ, ఆర్బీఐ కీలక వడ్డీ రేట్ల తగ్గింపు అంశాల ఎఫెక్ట్ తో స్టాక్ మార్కెట్లకు ఊపు వచ్చింది అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలున్నప్పటికీ భారత మార్కెట్లు మాత్రం లాభాల్లో ప్రారంభం అయ్యాయి. నిన్న మహావీర్ జయంతి కారణంగా మార్కెట్ కు సెలవుదినం. దాంతో ఈరోజు దయం ప్రారంభం నుంచే సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 1400 పాయింట్లు (1.54%) లాభంతో 75,200 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 450 పాయింట్లకు పైగా పెరిగి 22,850 స్థాయిలో ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 51 పైసలు పెరిగి, 86.18 వద్ద ఉంది.

లాభాల్లో పరుగులు..

సెన్సెక్స్ ప్రధాన షేర్లలో ఫార్మా, మెటల్ స్టాక్‌లలో గరిష్ట కొనుగోళ్లు అవుతున్నాయి. ఇందులో సిప్లా, టాటామోటార్స్‌, టాటా స్టీల్, హిందాల్కో, గ్రాసిమ్‌ షేర్లు లాభాల్లో కదలాడుతుండగా.. టీసీఎస్‌, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. NSEలోని 50 స్టాక్‌లలో 46 స్టాక్‌లు పెరుగుదలలో ఉన్నాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4.30%, ఫార్మా 2.50% పెరిగాయి. అదే సమయంలో.. ఆటో, ఐటీ సూచీలు దాదాపు 2% అధికంగా ట్రేడవుతున్నాయి. ట్రంప్ టారీఫ్ లకు 90 రోజులు పాజ్ నిర్ణయంతో మొన్న భారత మార్కెట్ 12 శాతం లాభాలతో ముగిసింది. నిన్న ఆసియా మార్కెట్లు కూడా 10 శాతం వరకు పెరుగుదలను చూశాయి. మహావీర్ జయంతి కారణంగా నిన్న అంటే గురువారం భారత  మార్కెట్ మూసివేయబడింది. అందుకే ఈరోజు అమెరికా,  ఆసియా మార్కెట్లు పతనమైనప్పటికీ భారత మార్కెట్ పైకి ఉంది. అమెరికా డౌ జోన్స్ ఇండెక్స్ 1,015 పాయింట్లు (2.50%), నాస్డాక్ కాంపోజిట్ 738 పాయింట్లు (4.31%), ఎస్ అండ్ పి 500 ఇండెక్స్ 189 పాయింట్లు (3.46%) నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 1,460 పాయింట్లు తగ్గి 33,148 వద్ద ముగిసింది. కొరియా కోస్పి 128 పాయింట్లు తగ్గి 2,416 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు  చైనా షాంఘై కాంపోజిట్ 0.14% తగ్గి 3,219 వద్ద ట్రేడవుతోంది. హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీ సైతం 0.34% వరకూ తగ్గింది.

today-latest-news-in-telugu | Stock Market Today | sensex | nifty

Also Read: PM Modi: తహావూర్ రాణా అప్పగింత వేళ ప్రధాని మోదీ పాత పోస్ట్ వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు