BIG BREAKING: ఆర్బీఐ గుడ్‌న్యూస్.. మళ్లీ వడ్డీ రేట్లు తగ్గింపు
ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లను తగ్గించింది. రెపో రేటును 0.25 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. 6.25శాతానికి ఉన్న రెపో రేటు 6 శాతానికి తగ్గింంచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే.
Stock Markets: చైనాపై ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రంప్ చైైనాపై 104% టారిఫ్‌లు పెంచడంతో ఆసియా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్ 319 పాయింట్ల నష్టంతో 73,907, నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 22,425 దగ్గర కొనసాగుతోంది.
Stock Market: నిన్న అధ:పాతాళానికి..ఈరోజు లాభాల్లో..
ట్రంప్ టారీఫ్ ల దెబ్బతో కుదేలైపోయిన స్టాక్ మార్కెట్ ఈరోజు కాస్త కోలుకుంది. ఉదయం మార్కెట్ ప్రారంభ సమయం నుంచే లాభాల బాటలో పయనిస్తోంది. సెన్సెక్స్ 1100 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లు పెరిగి 22,550 స్థాయిలో ట్రేడవుతున్నాయి.
TRUMP Tariffs: టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ఈ దేశాలపై సుంకాలు రద్దు..!
టారీఫ్‌ల విధింపులో ట్రంప్ వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా 180 దేశాలపై ఏప్రిల్ 2 నుంచి దిగుమతి సుంకాలు విధించింది. అమెరికన్స్‌తోపాటు, విదేశాల్లో ట్రంప్ చర్యపై వ్యతిరేకత రావడంతో 90రోజులు కొన్నిదేశాలపై సుంకాలు నిలిపివేసే అవకాశం ఉంది.
Gas Price Hike: సామాన్యుడికి షాక్.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు!
సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరింత భారం మోపింది. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెంచింది. LPG సిలిండర్‌పై రూ.50 పెంచినట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు రేపటినుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే పెట్రల్, డీజిల్ పై రూ.2 పెంచిన విషయం తెలిసిందే.
Petrol Price Hike: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పెట్రోలో, డీజిల్ పై మరో రూ.2 పెంచింది. ఏప్రిల్ 7 అర్థరాత్రి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు తెలిపింది. పెంచిన ధరలు కంపెనీలే భరిస్తాయని, సామాన్యుడిమీద భారం పడదని స్పష్టం చేసింది.