/rtv/media/media_files/2025/09/22/cheapest-recharge-plans-2025-09-22-19-18-31.jpg)
Cheapest Recharge Plans
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ చాలా అవసరం. ఇది లేకపోతే అస్సలు ఏ పని జరగదు. ఇప్పుడంతా ఇంటర్నెట్ పైనే నడుస్తోంది. ఏం చేయాలన్నా ఖచ్చితంగా డేటా ఉండాల్సిందే. అయితే చాలా మందికి రోజు వారీ డేటా సరిపోదు. దీంతో ఎన్నో ఇబ్బందులు పడతారు. అలాంటి వారికి ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించింది. ప్రస్తుతం ఉన్న పోటీ మార్కెట్లో ఇతర టెలికాం కంపెనీలకు ధీటుగా ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం పలు చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది.
అందులో మరీ ముఖ్యంగా డేటా వినియోగం ఎక్కువగా ఉన్నవారికి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తోంది. కేవలం అతి తక్కువ ధరలోనే ఎయిర్‌టెల్ డేటా వోచర్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో అన్‌లిమిటెడ్ డేటాతో పాటు ఓటీటీలకు యాక్సస్ కూడా అందిస్తుంది. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ డేటా అవసరమైనవారికి కూడా చీపెస్ట్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ మీకు రూ.125 కంటే తక్కువ ధరకు ప్రత్యేక డేటా ప్యాక్‌లను తీసుకువచ్చింది. ఈ ప్యాక్‌లు 20GB వరకు హై-స్పీడ్ డేటాను అందిస్తాయి. కొన్ని ప్యాక్‌లలో OTT యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్సన్ కూడా ఉన్నాయి.
రూ.33 డేటా ప్యాక్
ఈ రూ.33 డేటా ప్యాక్ చాలా సరసమైనది. కేవలం ఒక రోజు వ్యాలిడిటితో మాత్రమే వస్తుంది. దీనిలో వినియోగదారులు 2GB డేటా ప్రయోజనం పొందుతారు.
రూ.49 డేటా ప్యాక్
తక్కువ బడ్జెట్, ఎక్కువ డేటా అవసరం ఉన్నవారికి ఇది గొప్ప ఆప్షన్. ఈ ప్యాక్ కేవలం ఒక రోజు వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో వినియోగదారులు దాదాపు 20GB డేటాను పొందుతారు. డేటా పరిమితిని చేరుకున్న తర్వాత 64Kbpsతో ఇంటర్నెట్ పనిచేస్తుంది.
రూ.77 డేటా ప్యాక్
తక్కువ మొత్తంలో ఇంటర్నెట్ ఉపయోగించే వారికి రూ.77 డేటా ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. ఈ డేటా ప్యాక్‌లో వినియోగదారులు 7 రోజుల వ్యాలిడిటీతో 5GB డేటాను పొందుతారు.
రూ.99 డేటా ప్యాక్
రూ.99 డేటా ప్యాక్ ఎక్కువ డేటా కోసం చూస్తున్న వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుంది. ఇది కేవలం 2 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో వినియోగదారులు దాదాపు 20GB హై-స్పీడ్ డేటాను పొందుతారు. అయితే పరిమితిని చేరుకున్న తర్వాత 64Kbps వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది.
రూ.100 డేటా ప్యాక్
OTT ప్రియులకు ఈ డేటా ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. రూ.100లతో డేటా ప్యాక్ వేసుకుంటే.. 30 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. అలాగే 6GB డేటా లభిస్తుంది. అంతేకాకుండా ఈ డేటా ప్యాక్‌లో 22 కంటే ఎక్కువ OTT యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను పొందొచ్చు.
రూ.121 డేటా ప్యాక్
ఇంటర్నెట్‌ను స్లోగా యూజ్ చేసేవారికి రూ.121 డేటా ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్‌లో వినియోగదారులు 6GB డేటా పొందుతారు. ఇది 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.