GST 2.0: వినియోగదారులకు గుడ్ న్యూస్.. జీఎస్టీ 2.0.. భారీగా తగ్గిన ధరలివే!

కొత్త జీఎస్టీ ధరల వల్ల సామాన్య ప్రజలు ఉపయోగించే కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయి. ఇందులో వెన్న, నెయ్యి, పన్నీర్, వంట నూనెలు, ప్యాకేజ్డ్ గోధుమ పిండి, సబ్బులు వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల వస్తువులపై కూడా ధరలు తగ్గాయి.

New Update
Modi's Diwali gift.. GST reduction

GST

జీఎస్టీ 2.0(GST 2.0) వల్ల నేటి నుంచి కొన్ని వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. అయితే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ 2.0 సంస్కరణలను అమలు చేసింది. ఇటీవల జరిగిన 56వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో కొన్ని వస్తువులపై జీఎస్‌టీ రేట్లను మార్చాలని కేంద్ర ప్రభుత్వం(Central Government) నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే 12, 28 పన్ను స్లాబ్‌లను తొలగించింది. ఇప్పుడు కేవలం 5, 18 స్లాబ్‌లు మాత్రమే ఉంటాయని తెలిపింది. ఈ క్రమంలో కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. మరి అవేంటో ఈ స్టోరీలో  చూద్దాం. 

ఇది కూడా చూడండి: OnePlus Diwali Sale: వన్‌ప్లస్ దీపావళి సేల్‌.. ఫోన్లు, ట్యాబ్‌లు, బడ్స్‌పై జనాలు పిచ్చెక్కిపోయే ఆఫర్లు..!1

సామాన్య ప్రజలు ఎక్కువగా వినియోగించే..

కొత్త జీఎస్టీ ధరల వల్ల ఎక్కువగా సామాన్య ప్రజలు ఉపయోగించే కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయి. ఇందులో వెన్న, నెయ్యి, పన్నీర్, వంట నూనెలు, ప్యాకేజ్డ్ గోధుమ పిండి, సబ్బులు వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల వస్తువులపై కూడా ధరలు తగ్గాయి. ఇందులో ఎయిర్ కండీషనర్లు, డిష్‌వాషర్లు, టెలివిజన్‌లు, రూ. 25,000 లోపు ధర ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఆటోమొబైల్స్ రంగంలో కూడా కొన్ని మోడళ్ల ధరలు తగ్గాయి. మారుతి సుజుకికి చెందిన కొన్ని కార్లు, 350సీసీ లోపు ఉన్న టూ-వీలర్‌లు తక్కువ ధరలో లభిస్తాయి. చిన్న పిల్లలు వాడే నాప్కిన్లు, ట్రాక్టర్ టైర్లు, విడి భాగాలు, స్పెసిపైడ్ బయో పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రింట్స్‌ తగ్గుతాయి. విద్యార్థులకు అవసరమైన ఎక్సర్సైజ్ పుస్తకాలు, పెన్సిల్స్, నోట్‌బుక్స్‌పై ఉన్న జీఎస్టీ పూర్తిగా రద్దు చేశారు. వీటిపై 0 శాతం పన్ను ఉంటుంది. ఆరోగ్యం, జీవిత బీమా (హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్) ప్రీమియంలపై కూడా జీఎస్టీను తీసేశారు. 

పాన్ మసాలా, గుట్కా, నమిలే పొగాకు, సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం పన్ను 28 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. అలాగే కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, కెఫిన్ ఉన్న పానీయాలు, ఫ్రూట్ ఫిజ్జీ డ్రింక్స్ ధరలు కూడా పెరిగాయి. వీటితో పాటు లగ్జరీ కార్లు, పెద్ద మోటార్‌ సైకిళ్లు, ప్రైవేట్ విమానాలు, రివాల్వర్లు, పిస్టల్‌ వంటి వాటిపై పన్నును 40 శాతానికి పెంచారు. వీటితో పాటు బొగ్గు, లిగ్నైట్‌పై 5 శాతం నుంచి 18 శాతానికి పన్నును పెంచారు.  బయోడీజిల్‌పై పన్నును 12 నుంచి 18 శాతానికి పెంచారు.  అలాగే రూ. 2,500 కన్నా ఎక్కువ ధర ఉన్న ప్రీమియం వస్త్రాలు, టెక్స్‌టైల్, హై-వాల్యూ కాటన్ దుప్పట్లపై 18 శాతానికి పన్ను పెంచారు. 

ఇది కూడా చూడండి: Maruti Car Offers 2025: కార్లపై రూ.1.29లక్షల భారీ తగ్గింపు.. మారుతి మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్ - లిస్ట్ ఇదే

Advertisment
తాజా కథనాలు