/rtv/media/media_files/2025/09/21/samsung-galaxy-s24-ultra-mobile-offer-2025-09-21-21-17-46.jpg)
Samsung Galaxy S24 Ultra Mobile offer
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ Amazon Great Indian Festival Sale సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఎలక్ట్రానిక్స్‌తో సహా వివిధ ప్రొడెక్టులపై భారీ డిస్కౌంట్లు పొందొచ్చు. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ల ద్వారా కస్టమర్‌లు అదనపు ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ సేల్‌లో Samsung Galaxy S24 Ultra పై భారీ తగ్గింపు లభిస్తుంది.
Samsung Galaxy S24 Ultra Mobile offer
ఈ సేల్‌లో Samsung Galaxy S24 Ultraను తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ బేస్ మోడల్ అసలు ధర రూ.1,34,999 ఉండగా.. ఇప్పుడు అమెజాన్ సేల్‌లో కేవలం రూ.71,000 ధరకు కొనుగోలు చేయవచ్చని అమెజాన్ తెలిపింది. ఈ సేల్‌లో కస్టమర్లు బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఇఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపు ఉంటుంది.
మరో ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సైతం Samsung Galaxy S24 Ultraపై భారీ ఆఫర్ ప్రకటించింది. దీని 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ కేవలం రూ.54,990 ధరకు లభిస్తోంది. అయితే ఈ ధర ఫ్లిప్‌కార్ట్ రాబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో చెల్లుతుంది. ఈ ధరలో డిస్కౌంట్లు, క్రెడిట్ కార్డ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.
Samsung Galaxy S24 Ultra Specs
Samsung Galaxy S24 Ultra స్మార్ట్‌ఫోన్ 6.8-అంగుళాల క్వాడ్ HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120 Hz వరకు ఉంటుంది. ఇది Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. Samsung Galaxy S24 Ultra స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారంగా One UI 6.1 పై నడుస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G, 5G, Wi-Fi, బ్లూటూత్, GPS, NFC, USB టైప్-C పోర్ట్ వంటివి ఉన్నాయి.
Samsung Galaxy S24 Ultra స్మార్ట్‌ఫోన్ 45 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000 mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది. Samsung Galaxy S24 Ultra వెనుక కెమెరా యూనిట్‌లో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 10-మెగాపిక్సెల్ నాల్గవ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 12-మెగాపిక్సెల్ కెమెరా ఉంది.