OnePlus Diwali Sale: వన్‌ప్లస్ దీపావళి సేల్‌.. ఫోన్లు, ట్యాబ్‌లు, బడ్స్‌పై జనాలు పిచ్చెక్కిపోయే ఆఫర్లు..!

వన్‌ప్లస్ దీపావళి ఫెస్టివ్ సేల్ సెప్టెంబర్ 22న ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చు. లేటెస్ట్ వన్‌ప్లస్ 13 సిరీస్ ఫోన్లతో పాటు నార్డ్ సిరీస్ ఫోన్లపైనా ప్రత్యేక ఆఫర్లు లభిస్తున్నాయి.

New Update
OnePlus Diwali Festive Sale

OnePlus Diwali Festive Sale

OnePlus Diwali Sale 

OnePlus తన దీపావళి సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ఇతర ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తుంది. OnePlus Diwali Sale సెప్టెంబర్ 22న ప్రారంభమవుతుంది. కస్టమర్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రయోజనాలను పొందుతారు. OnePlus బ్రాండ్‌కి సంబంధించిన ప్రొడెక్టులను Flipkart, BlinkIt, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి. అందువల్ల మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ సేల్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ సేల్ సమయంలో అందుబాటులో ఉన్న ఆఫర్‌ల వివరాలను తెలుసుకుందాం. 

Smartphone Offers 2025

OnePlus 13 లైనప్‌ను వేల రూపాయల తగ్గింపుతో కొనుగోలు చేసుకోవచ్చు. దీపావళి సేల్ సమయంలో OnePlus 13R భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఇది లాంచ్ సమయంలో రూ.42,999 ధరకు ప్రారంభించబడింది. ఇప్పుడు సేల్ సమయంలో కేవలం రూ.35,749కి అందుబాటులో ఉంటుంది. అంటే ఈ ఫోన్‌పై రూ.5,000 వరకు భారీ తగ్గింపు, రూ.2,250 బ్యాంక్ డిస్కౌంట్‌ను పొందొచ్చు. 

OnePlus 13s పై కూడా మంచి డీల్ ఉంది. రూ.54,999 కు లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు OnePlus Diwali Sale సమయంలో రూ.47,749 కు అందుబాటులో ఉంటుంది. అంటే దీనిపై రూ.4,000 తగ్గింపు, రూ.3,250 బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు. 

అలాగే OnePlus 13 విషయానికొస్తే.. ఈ మొబైల్ రూ.57,749 కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధరపై రూ. 8,000 తగ్గింపు, రూ.4,250 బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. అంతేకాకుండా OnePlus Nord CE5 మొబైల్ రూన.24,999 ధరకు లాంచ్ అయింది. ఇప్పుడు ఈ OnePlus Nord CE5 సేల్ సమయంలో రూ.21,499 ధరకు లభిస్తుంది. 

దీంతోపాటు టాబ్లెట్‌లపై కూడా భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. జూలైలో లాంచ్ అయిన OnePlus Buds 4 రూ.4,799 కు అందుబాటులో ఉంటుంది. అలాగే OnePlus Buds Pro 3 అసలు ధర రూ.11,999 ఉండగా.. ఈ సేల్‌లో కేవలం రూ.7,999 కు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా OnePlus Pad Lite బేస్ మోడల్ రూ.14,999 కు లభిస్తుంది. అలాగే OnePlus Pad Go ను రూ.13,749 కు కొనుగోలు చేయవచ్చు.

Advertisment
తాజా కథనాలు