/rtv/media/media_files/2025/09/22/flipkart-big-billion-days-sale-2025-motorola-discounts-2025-09-22-15-01-11.jpg)
Flipkart Big Billion Days Sale 2025 Motorola discounts
Flipkart Big Billion Days Sale 2025 సందర్భంగా మోటరోలా తన స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 ప్లస్ సభ్యులు, బ్లాక్ సభ్యులకు ఇవాళ్టి నుంచే అందుబాటులోకి వచ్చింది. సాధారణ వినియోగదారులకు ఈ సేల్ సెప్టెంబర్ 23న అంటే రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Flipkart Big Billion Days Sale 2025 Motorola discounts
Motorola Edge 60 Pro
Motorola Edge 60 Pro స్మార్ట్‌ఫోన్ 8+256 GB వేరియంట్ అసలు ధర రూ.29,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇప్పుడు దీనిని Flipkart Big Billion Days Sale 2025లో కేవలం రూ.26,999లకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిపై బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి. ఈ బ్యాంక్ ఆఫర్ తర్వాత ఈ Motorola Edge 60 Pro ఫోన్ రూ.24,999లకు లభిస్తుంది. ఎడ్జ్ 60 ప్రో 6.7-అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15పై నడుస్తుంది. వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది.
2/2- Motorola discounts during Flipkart Big Billion Deals revealed
— TechPP (@techpp) September 12, 2025
Moto g35 5G: ₹8,999/-
Moto g85 (8|128GB): ₹14,999*/-
Moto g05: ₹6,999/-
Motorola razr 60: ₹39,999/-
Moto Edge 60 Stylus: ₹19,999*/-
Moto razr 60 Swarovski: ₹49,999*/- #FlipkartBigBillionDays#Motorolapic.twitter.com/gs2pVOfvyE
Motorola Edge 60 Fusion
Motorola Edge 60 Fusionలోని 8+256GB వేరియంట్ అసలు ధర రూ.22,999గా ఉంది. దీనిని ఇప్పుడు కేవలం రూ.19,999 కు సేల్‌లో కొనుక్కోవచ్చు. 12+256GB వేరియంట్ అసలు ధర రూ.24,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.21,999కు కొనుక్కోవచ్చు. Motorola Edge 60 Fusion 5G మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 68W టర్బో ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
Motorola G96 5G
Motorola G96 5G స్మార్ట్‌ఫోన్ 8+128GB వేరియంట్ అసలు ధర రూ.17,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.14,999లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే 8+256GB వేరియంట్ అసలు ధర రూ.19,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.16,999 కొనుక్కోవచ్చు. Motorola G96 5G స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ HD+ 10-బిట్ 3D కర్వ్డ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అందించారు. 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 33W వైర్డు టర్బోపవర్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
The wait is almost over! This #BigBillionDays, Motorola is dropping never-before festive prices across all segments. Whether you want power, style, or battery that lasts, Moto’s got you covered. #HellomotoNachoNacho#BBDMotoRush [Brand Story]https://t.co/b7fjT8PcOX
— 91mobiles (@91mobiles) September 16, 2025
Motorola G86 Power
Motorola G86 Power స్మార్ట్‌ఫోన్ 8+128GB వేరియంట్ అసలు ధర రూ.17,999 కు బదులుగా రూ.15,999 కు లభిస్తుంది. Motorola G86 Power మొబైల్ 5G 6.7-అంగుళాల సూపర్ HD AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. 33W టర్బోపవర్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,720mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది.
Motorola Razr 60
Motorola Razr 60 స్మార్ట్‌ఫోన్ 8+256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.49,999 ఉండగా.. ఇప్పుడు రూ.10,000 తగ్గింపు తర్వాత కేవలం రూ.39,999కు లభిస్తుంది. Motorola Razr 60 స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.9-అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మరొకటి 90Hz రిఫ్రెష్ రేట్‌తో 3.6-అంగుళాల కవర్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7400X చిప్‌సెట్ అందించారు. ఇది Android 15 ఆధారంగా హలో UIపై నడుస్తుంది.
మరిన్ని మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లు
Moto G35 5G 4+128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.9,999 గా ఉంది. ఇప్పుడు దీనిని రూ.1,000 తగ్గింపు తర్వాత రూ.8,999కి లభిస్తుంది.
Moto G45 5G 8+128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.12,999కి బదులుగా రూ.2,000 తగ్గింపు తర్వాత రూ.10,999కి లభిస్తుంది.
Moto G85 5G 8+128GB స్టోరేజ్ వేరియంట్ రూ.17,999కి బదులుగా రూ.10,999కి లభిస్తుంది. అంటే రూ.3,000 తగ్గింపు లభిస్తుంది.