/rtv/media/media_files/2025/09/22/oppo-find-x9-series-2025-09-22-20-17-26.jpg)
Oppo Find X9 Series
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన Oppo Find X9 సిరీస్‌ను వచ్చే నెలలో లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో Oppo Find X9, Oppo Find X9 Pro మోడళ్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా కలర్‌ఓఎస్ 16ను అమలు చేసే మొదటి స్మార్ట్‌ఫోన్‌లు ఇవే కావడం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ముందస్తు బుకింగ్‌లు చైనాలో ప్రారంభమయ్యాయి.
Oppo Find X9 Series
Oppo మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ Weiboలోని ఒక పోస్ట్‌లో.. Oppo Find X9 series అక్టోబర్ 16న చైనాలో లాంచ్ అవుతుందని ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ముందస్తు బుకింగ్స్ చైనాలో ప్రారంభమయ్యాయి. రాబోయే ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు MediaTek Dimensity 9500 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతాయి. వినియోగదారులు వాటిలో ColorOS 16ని ముందే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
Our upcoming flagship, the OPPO Find X9 Series, will launch globally and feature the groundbreaking @MediaTek Dimensity 9500 chipset.
— OPPO (@oppo) September 22, 2025
Find out more 🔗 https://t.co/KjWXM0yVDMpic.twitter.com/rQ18Q2LTlv
ఈ Oppo Find X9 seriesలో కంపెనీ డెవలప్ చేసిన ట్రినిటీ ఇంజిన్ ఉంటుంది. ఫైండ్ X9 మొబైల్ 7,000 mAh బ్యాటరీతో వస్తుంది. అయితే ఫైండ్ X9 ప్రోలో మాత్రం 7,500 mAh బ్యాటరీని అందించారు. రాబోయే స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో హాసెల్‌బ్లాడ్-ట్యూన్ చేయబడిన వెనుక కెమెరా యూనిట్ ఉంటుంది. అలాగే ఫైండ్ X9 ప్రోలో 70 mm ఫోకల్ లెంగ్త్, 200-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను అందించారు.
ఈ సిరీస్ స్టాండర్డ్ మోడల్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 6.59-అంగుళాల ఫ్లాట్ LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. ఇది సేఫ్టీ కోసం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని అంచనా. ఈ Oppo Find X9 series స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 9500 ప్రాసెసర్‌ని కలిగి ఉండే ఛాన్స్ ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ సోనీ LYT-808 ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ Samsung JN5 అల్ట్రా-వైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50-మెగాపిక్సెల్ Samsung JN9 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 50-మెగాపిక్సెల్ Samsung JN1 కెమెరా ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లోని రెండు స్మార్ట్‌ఫోన్‌ల బ్యాటరీ 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.