Stock Market Today: ఒక్కసారిగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కారణాలివే!

హెచ్1బీ వీసాల ఫీజు పెంపుతో పాటు జీఎస్టీ ప్రభావం వల్ల నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలపడ్డాయి. నేడు సెన్సెక్స్ 475.16 పాయింట్లు పడిపోయి 82,151.07 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 88.95 పాయింట్లు తగ్గి 25,238.10 వద్ద ప్రారంభమైంది.

New Update
stock market losses

Stock Market

నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market Today) కుప్పకూలాయి. హెచ్1బీ వీసాల ఫీజు పెంపు(H1B Visa Fee Hikes) తో పాటు జీఎస్టీ ప్రభావం వల్ల స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలపడ్డాయి(Stock Market Losses Today). అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతి H1-B వీసాకు 100,000 డాలర్ల రుసుము విధించిన తర్వాత స్టాక్ మార్కెట్లు నష్టాల బారిన పడుతున్నాయి. నేడు సెన్సెక్స్ 475.16 పాయింట్లు పడిపోయి 82,151.07 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 88.95 పాయింట్లు తగ్గి 25,238.10 వద్ద ప్రారంభమైంది. మార్కెట్ల ప్రారంభంలోనే స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ కావడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చూడండి: Maruti Car Offers 2025: కార్లపై రూ.1.29లక్షల భారీ తగ్గింపు.. మారుతి మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్ - లిస్ట్ ఇదే

ట్రేడింగ్ ప్రారంభంలో..

ట్రేడింగ్ ప్రారంభంలో బిఎస్‌ఇ(BSE) మిడ్‌క్యాప్ 262.45 పాయింట్లు లేదా 0.56 శాతం క్షీణించగా, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 193.76 పాయింట్లు లేదా 0.35 శాతం తగ్గి 54,428.28 వద్ద ట్రేడవుతోంది.  నేడు సెన్సెక్స్ ప్యాక్‌లో, ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాల్లో న డుస్తున్నాయి. ముఖ్యంగా అదానీ పోర్ట్స్ 0.91 శాతం పైగా పెరిగి అగ్రస్థానంలో ఉన్నాయి. మరోవైపు టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టిసిఎస్, హెచ్‌సిఎల్ టెక్, భారతి ఎయిర్‌టెల్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. 
ఈరోజు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1-బి వీసాల కోసం అధిక రుసుము విధించడం వల్ల సాధారణంగానే ఉన్నాయి. 

ఇది కూడా చూడండి: New GST Slabs: అర్థరాత్రి నుంచి జీఎస్టీ 2.0.. వీటిపై భారీగా తగ్గనున్న ధరలు - లిస్ట్ ఇదే..!

Advertisment
తాజా కథనాలు