నేటి నుంచి కొత్త జీఎస్టీ కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు తగ్గిన ధరలతో ఉపశమనం లభిస్తుంది. నెలవారీ ఖర్చులతో తడిసి మోపెడవుతున్న తరుణంలో.. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ శ్లాబ్‌లలో మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయం.. పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్ద ఊరట కలిగించనుంది. దీపావళికి దేశ ప్రజలకు భారీ బహుమతి ఇస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ.. అంతకు ముందుగానే దసరా పండగ రోజున తగ్గిన ధరలతో వస్తువులు చేతికి అందనున్నాయి.
New GST in India
జీఎస్టీ శ్లాబ్‌లలో మార్పులతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయి. షాంపూలు, సబ్బులు, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, రేజర్లు, బేబీ డైపర్లు వంటి హ్యుజ్ వినియోగ వస్తువులు చౌకగా లభించనున్నాయి. టీవీలు, కంప్యూటర్లు, ఇలాంటివి కూడా తగ్గిన ధరలతో మార్కెట్‌లో వస్తున్నాయి. ఇప్పటికే అనేక తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. రేపటి నుండి అమలులోకి రానున్న జీఎస్టీ కొత్త శ్లాబ్‌లు 5 శాతం, 18 శాతం మాత్రమే ఉండనున్నాయి. దాదాపుగా 200పైగా వస్తువులపై పన్ను తగ్గించి సామాన్యులకు కేంద్రం ఊరట కల్పించింది. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ కూడా 28% నుంచి 18% స్లాబ్‌లోకి తగ్గనున్నాయి.
ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, డిష్‌వాషర్లు, పెద్ద స్క్రీన్ టీవీలు, సిమెంట్ వంటి వస్తువులు ఉంటాయి. ఇక ఆటోమొబైల్ రంగంలో చిన్న కారు మోడల్స్ 28% నుండి 18%కి తగ్గవచ్చు. ద్విచక్ర వాహనాలు కూడా తక్కువ స్లాబ్‌లోకి మారవచ్చు. లగ్జరీ కార్లపై అధిక పన్ను కొనసాగుతుంది. భీమా, ఆర్థిక సేవల వర్గంలో, ప్రీమియంలు 18% GSTలో ఉన్నాయి. ఇవి కొంత ఖరీదైనవి.. కానీ కొత్త GST 2.0 కింద.. ఆరోగ్య బీమా, జీవిత బీమా, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు, యాంటీ-క్యాన్సర్ మందులు, థర్మామీటర్లు, గ్లూకోమీటర్లు వంటి మెడికల్ ఉత్పత్తులపై పన్ను పూర్తిగా రద్దు చేశారు. రైతుల కోసం వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని 12% నుండి 5%కి తగ్గించారు. నోట్‌బుక్స్, ఎరేసర్లు, పెన్సిల్స్, క్రేయాన్స్ వంటి విద్యా సామగ్రిపై పన్ను 12% నుండి 5%కి తగ్గించారు. దీని ఫలితంగా, మధ్య-ఆదాయ కుటుంబాల కోసం భీమా ఖర్చులు తగ్గుతాయి. కవరేజీ పెరుగుతుంది, ఆర్థిక భద్రత మెరుగవుతుంది.
ఇక సిగరెట్లు, బీడీలు, గుట్కా, పాన్ మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తులు, చక్కెర కలిగిన కార్బొనేటెడ్ డ్రింక్స్, ఫ్లేవర్డ్ బెవరేజెస్, పెద్ద కార్లు, 350cc పైగా బైకులు, ప్రైవేట్ హెలికాప్టర్లు, యాట్స్ వంటి వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించనున్నారు. మొత్తంగా ఇప్పటికే ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన వివిధ తయారీ సంస్థలు.. రేపటి నుంచి తగ్గించిన ధరలతో అమ్మకాలు జరపనున్నాయి. దసరా పండగకు ముందే జీఎస్టీ తగ్గింపు ధరలు అమలులోకి రానుండటంతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు మరింత హ్యాపీగా పండగ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్లయిది.