Maruti Car Offers 2025: కార్లపై రూ.1.29లక్షల భారీ తగ్గింపు.. మారుతి మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్ - లిస్ట్ ఇదే

మారుతి కార్లపై సెప్టెంబర్ 22 నుండి ఆఫర్లు ప్రారంభం కానున్నాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎంపిక చేసిన మోడల్‌లపై రూ. 1.29 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది.

New Update
maruti Car Offers (1)

maruti Car Offers

దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన కార్లపై భారీ ధరల తగ్గింపు(car offers)ను ప్రకటించింది. మారుతి వ్యాగన్ఆర్ నుండి ఆల్టో, ఇగ్నిస్ వంటి చిన్న కార్ల వరకు కంపెనీ దాదాపు రూ.1.29 లక్షల వరకు ధరల తగ్గింపును ప్రకటించింది. ఈ ధరల తగ్గింపులు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వస్తాయి. మారుతి సుజుకి విడుదల చేసిన అధికారిక ప్రకటనలో.. ఇటీవలి వస్తువులు, సేవల పన్ను (GST) సంస్కరణల ప్రయోజనాలను నేరుగా వినియోగదారులకు అందజేస్తామని పేర్కొంది. ఫలితంగా కంపెనీ తన పోర్ట్‌ఫోలియో మోడళ్లపై ధరల తగ్గింపులను ప్రకటించింది. దీనిపై మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కార్ల ధరల తగ్గింపు ఇటీవలి GST సంస్కరణలకు అనుగుణంగా ఉందని తెలిపారు. ఇప్పుడు ప్రతి కారు ధర తగ్గింపుల గురించి తెలుసుకుందాం. 

Maruti Festive Offers

Maruti S-Presso

Maruti S-Presso అత్యంత సరసమైన కారుగా మారింది. కంపెనీ ఈ కారుపై భారీ తగ్గింపు ప్రకటించింది. దాదాపు రూ.129,600 భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ తగ్గింపు తర్వాత Maruti S-Presso కారును కేవలం రూ.3,49,900లకే సొంతం చేసుకోవచ్చు. 

Maruti Alto K10

Maruti Alto K10 పై కంపెనీ రూ.1,07,600 వరకు తగ్గించింది. దీని తర్వాత Maruti Alto K10 కేవలం రూ.3,69,900లకే కొనుక్కోవచ్చు. 

Maruti Celerio

Maruti Celerio కారు ధర కూడా భారీగా తగ్గింది. దీనిపై కంపెనీ రూ.94,100 తగ్గించింది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని రూ.4,69,900లకే సొంతం చేసుకోవచ్చు.

Also Read:  వన్‌ప్లస్ దీపావళి సేల్‌.. ఫోన్లు, ట్యాబ్‌లు, బడ్స్‌పై జనాలు పిచ్చెక్కిపోయే ఆఫర్లు..!

మారుతి సుజుకి జీఎస్టీ ధరల తగ్గింపు

Maruti Wagon-R

Maruti Wagon-R కారుపై రూ.79,600 ధర తగ్గింది. ఈ డిస్కౌంట్‌తో Maruti Wagon-R కారు కేవలం రూ.4,98,900లకే లభిస్తుంది. 

Maruti Swift

మారుతి సుజుకి తన ప్రసిద్ధ Maruti Swift పై రూ. 84,600 ధర తగ్గింపును ప్రకటించింది. దీంతో మారుతి స్విఫ్ట్ కేవలం రూ.5,78,900లకే సొంతం అవుతుంది. 

బాలెనో ధర రూ.86,100 తగ్గింది. ఈ డిస్కౌంట్ తర్వాత మారుతి బాలెనో కారును కేవలం రూ.5,98,900లకే కొనుక్కోవచ్చు. 

Also Read :  అరాచకం.. రూ.3,700కే సోఫా & బెడ్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో పిచ్చెక్కిపోయే ఆఫర్లు

image (62)

అలాగే కంపెనీ మొట్టమొదటి 5-స్టార్ సేఫ్టీ-రేటెడ్ కారు అయిన మారుతి డిజైర్ ధర కూడా తగ్గింది. ఈ కారుపై దాదాపు రూ.87,700 డిస్కౌంట్ లభిస్తోంది. ఈ తగ్గింపుతో మారుతి డిజైర్ కారు కేవలం రూ.6,25,600లకే కొనుక్కోవచ్చు. 

మారుతి సుజుకి తన SUV, MPV మోడల్ ధరలను కూడా భారీగా తగ్గించింది. కంపెనీ తన అత్యంత సరసమైన SUV, ఫ్రాంక్స్ ధరను రూ.1,12,600 తగ్గించింది. ఈ తగ్గింపుతో ఫ్రాంక్స్ కేవలం రూ.6,84,900లకే సొంతం అవుతుంది. ఇంకా బ్రెజ్జా ధర రూ.1,12,700 తగ్గింది. దీంతో ఇప్పుడు మీరు బ్రెజ్జాను రూ.8,25,900కే లభిస్తుంది. దీంతోపాటు మరెన్నో మోడల్స్‌పై కంపెనీ భారీగా ధరలను తగ్గించింది. కింద ఉన్న లిస్ట్ ఆధారంగా ఏ కారు తక్కువగా ఉందో చూసి కొనేయండి. 

Advertisment
తాజా కథనాలు