/rtv/media/media_files/2024/11/27/8hq0OFDoetmyj7gItFuz.webp)
రేపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మూడోసారి గవర్నమెంట్ ఏర్పరిచాక ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ ఇది. ఈ నేపథ్యంలో ఈరోజు స్టాక్ మార్కెట్లు ఆకు పచ్చరంగును సంతరించుకున్నాయి. మార్కెట్ మొదలైన దగ్గర నుంచి లాభాలవైపు పరుగులు తీస్తున్నాయి. బిఎస్‌ఇ (BSE) సెన్సెక్స్ 76,900 దగ్గర ఉండగా, నిఫ్టీ (Nifty) 23,300 పైన ఉంది.
Also Read : తిరుమలలో మరోసారి చిరుత కలకలం!
ఉదయం నుంచే పెరుగుదల..
ఉదయం 9:17 గంటలకు, BSE సెన్సెక్స్ 135 పాయింట్లు పెరిగి 76,893.32 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 54 పాయింట్లు పెరిగి 23,303.50 వద్ద ఉంది. ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్ లో షేర్ల కొనుగోళ్లు మార్కెట్ కు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ 30 షేర్లో ఎల్‌అండ్‌టీ, టైటాన్, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్ లో ట్రేడవుతుండగా.. ఐటీసీ హోటల్స్, భారతీ ఎయిర్‌టెల్స్, బజాజ్‌ఫిన్‌సర్వ్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా షేర్లు నష్టాల్ నడుసతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.86.64 దగ్గర కొనసాగుతోంది.
Also Read: SSMB 29: ఎస్ఎస్ఎమ్బీలో ప్రియాంక చోప్రా..దీని వెనుక స్కెచ్ పెద్దదే..
మోవైు బంగారం ధర (Gold Rate) ఎరికీ అందనంత ఎత్తు పెరిగిపోతోంది. రూపాయి పతనం అవుతుంటే...బంగర ధర ఆకాశాన్ని తాకుతోంది. గత బడ్జెట్ లో ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాలను బాగా పెంచేసింది. దీంతో 2024లో దీని ధర పరుగులు పెట్టింది. ఇప్పుడు ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతుందని మార్కెట్లో అంచనాలు వెలువడుతున్నాయి. ఈ కారణంగా కూడా బడ్జెట్ ముందు రోజు అయిన ఈరోజు పసిడి ధరలు అమాంతం పైకెగిశాయి. ఇక గ్లోబల్ లో నిన్న యూఎస్ మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. కానీ ఆసియా మార్కెట్లు మాత్రం క్షీణించాయి. అయితే అవి ఇండియన్ మార్కెట్ మీద పెద్దగా ప్రభావం చూపించలేదు.
Also Read: Business: ఈ టాప్ 5 షేర్ల మీద పెట్టుబడి పెడితే...లాభాలు మీ వెంటే...
Also Read : విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుందని కన్నేశాడు... తండ్రితో కలిపి ఇద్దర్ని