/rtv/media/media_files/2025/01/27/TvKbboAYf8XFSUHNdwZn.jpg)
Priyanka chopra ssmb
రాజమౌళి సినిమా తీస్తున్నాడంటే అందరూ దాని గురించే మాట్లాడుకుంటారు. తన సినిమా విషయాలు ఎంత బయటకు రావొద్దని అనుకున్నా...ఎంత కట్టుదిట్టం చేసినా వార్తలు వ్యాపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం రాజమౌళి అమెజా్ అడవుల బ్యాక్ డ్రాప్ లో మహేష్ బాబుతో సినిమా తీస్తున్నారు. దీని షూటింగ్ కూడా మొదలైపోయిందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. సైలెంట్ గా షూట్ కూడా చేస్తున్నారు. కానీ సినిమాకి సంబంధించి ఒక్క విషయం కూడా బయటకు రానీయడం లేదు. అయితే ఇందులో ఇంటర్నేషనల్ ఫిగర్ ప్రియాంకా చోప్రా నటిస్తోందని మాత్రం తెలిసింది. రీసెంట్ గా ఆమె హైదరాబాద్ వచ్చిన విషయం స్వయంగా ప్రియాంకనే పోస్ట్ పెట్టింది కూడా. ఇప్పుడు ఈ హాలీవుడ్ హీరోయిన్ కు సంబంధించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ వెనుక ప్రియాంక ఏజెన్సీ..
ఎస్ఎస్ఎమ్బీ మూవీ వర్కింగ్ టైటిల్ మాత్రమే. అసలు పేరు ఇంకా పెట్టలేదు. అయితే ఈ మూవీలో ప్రియాంక చోప్రాను తీసుకోవడంపై రాజమౌళి పెద్ద ప్లానే వేశారని చెబుతున్నారు. జక్కన్న దీని కన్నా ముందు తీసిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు ఒక ఆస్కార్ వచ్చింది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు ఇచ్చారు. దీనిని రాజమూళి టీమ్ ప్రియాంక చోప్రాకు చెందిన ఏజెన్సీ ద్వారానే అప్లై చేశారుట. అంతేకాదు నాటునాటు పాటకు ఆస్కార్ రావడం వెనుక ప్రియాంక చాలానే కష్టపడ్డారని చెబుతున్నారు. ఆమె ఏజెన్సీ విపరీతంగా ప్రచారం చేసిందని అంటున్నారు.
Also Read: USA: అమెరికాలో విద్యార్థుల విలవిల..క్యాంపస్ లో మాత్రమే ఉద్యోగాలతో ఇబ్బందులు
ఆమె క్రేజే వేరు..
ఈ కారణంగానే ఇప్పుడు తీస్తున్న ఎస్ఎస్ఎమ్బీలో ప్రియాంక చోప్రాను తీసుకున్నారు రాజమౌళి అని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆమె ఏజెన్సీ అంత కష్టపడితే...స్వయంగా ప్రియాంక నటించిన సినిమానే అయితే మరింత పుష్ చేయడానికి అవకాశం ఉంటుంది. సినిమా ఆస్కార్ కు వెళ్ళడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని అనుకుంటున్నారు. దానికి తోడు ప్రియాంక చోప్రాకు ప్రస్తుతం హాలీవుడ్ మంచి ఇమేజ్ ఉంది. ఆమె భర్తతో కలిసి ప్రియాంక ఒక రకంగా చక్రం తిప్పుతోందనే చెప్పాలి. ఈ క్రేజ్ తో ఎస్ఎస్ఎమ్బీకి కూడా క్రేజ్ తీసుకువస్తుందని భావిస్తున్నారు. అందుకే రాజమౌళి తెలివిగా ఈసినిమాలో ఆమెను భాగం చేశారని చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు ఎంతున్నాయో తెలియదు కానీ.. ఇదే కనుక నిజమైతే ఎస్ఎస్ఎమ్బీ సినిమాకు మళ్ళీ ఆస్కార్ రావడం పెద్ద కష్టమేమీ కాదు. మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా సహా జాన్ అబ్రహంల మీద సీన్స్ షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ షూటింగ్ పూర్తయ్యాక అమెజాన్ అడవుల్లో ఉంటుందని చెబుతున్నారు.
Also Read: USA: ట్రాఫిక్ కంట్రోల్ టవర్ లో సిబ్బంది కొరత...వాషింగ్టన్ ప్రమాదానికి కారణం ఇదే..