/rtv/media/media_files/2025/01/31/bm07LxyX3UTI5cI3ULca.jpg)
a doctor close to the family held
వైద్యం కోసం తన దగ్గరికి వచ్చిన తండ్రి, కుమార్తెలను ఓ డాక్టర్ తన తెలివిని ఊపయోగించి చంపేశాడు. ఈ ఘటన చైన్నెలో చోటుచేసుకుంది. బంధువుల ఫిర్యాదుతో డాక్టర్ కిరాతకాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. వేలూరుకు చెందిన శామ్యువేల్(78) ఆయన కూతురు సింధియా(35) చైన్నెలో ఉంటున్నారు. భర్తకు విడాకులు (Divorce) ఇచ్చిన సింధియా(35) తండ్రికి సేవలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది.
ఒంటరిగా ఉన్న సింధియాకు డాక్టర్ రాణా శామ్యుయేల్తో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తన తండ్రి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయాన్ని రాణా శామ్యుయేల్తో పంచుకుంది సింధియా. దీంతో ఆమె తండ్రికి చికిత్స అందించేందుకు రాణా ముందుకు వచ్చాడు. అయితే ట్రీట్మెంట్ కోసం చైన్నె శివారులోని తిరుముల్‌లై వాయిల్ తిరుమలివాసన్ నగర్‌లో ఓ ప్లాట్ తీసుకున్నారు సింధియా. ఈ ప్లాట్ కూడా డాక్టర్ రాణానే ఇప్పి్ంచాడు.
Also Read : సిరియా పై విరుచుకుపడిన అమెరికా..మోస్ట్ వాటెండ్ సీనియర్ ఉగ్రవాది హతం!
Homeopathy Murders
దీంతో తరచూ ఇక్కడికి వచ్చి ఆమె తండ్రికి వైద్య సేవలు అందిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అతని తండ్రి సరిగ్గా మూడు నెలల క్రితం చనిపోయాడు. దీంతో తన తండ్రికి ఏమైందని.. ఏ ట్రీట్మెంట్ చేశావంటూ సింధియా డాక్టర్ రాణాను నిలదీసింది. దీంతో ఇరువురి మధ్య గొడవ జరగగా.. సింధియాను రాణా బలంగా నెట్టివేయడంతో ఆమెకు బలమైన గాయం అయింది. దీంతో ఆమె స్పాట్ లోనే కన్నుమూసింది.
Also Read : ఎస్ఎస్ఎమ్బీలో ప్రియాంక చోప్రా..దీని వెనుక స్కెచ్ పెద్దే..
ప్లాట్లో తండ్రి కూతురు ఇద్దరు చనిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రాణా తన డాక్టర్ తెలివితేటలను ఊపయోగించాడు. వాళ్లది సహాజ మరణం అని సృష్టించే దిశగా ప్రయత్నాలు చేశాడు. ఇద్దరి డెడ్ బాడీలను ఒకే గదిలో పెట్టి ఎలాంటి దుర్వాసన రాకుండా కెమికల్స్ ను ఉపయోగించాడు. డెడ్ బాడీలు కుళ్లి పోకుండా ఉండేలాగా ఆ గదిలో నిరంతరం ఏసీ పనిచేసే విధంగా ఏర్పాటు చేశాడు. ఆ తరువాత తాళం వేసి అక్కడినుంచి వెళ్లి పోయాడు. ఇలా మూడు నెలల పాటు ఆ ప్లాట్ క్లోజ్ గానే ఉంది.
Also Read : నాగోబా జాతరలో నేడు కీలక ఘట్టం... దర్బార్ కు నేటికి ఎన్నెండ్లంటే...?
తండ్రికూతురు ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో చివరకు బంధువులు కొందరు స్పందించడంతో మృతదేహాన్ని పోలీసులు కనిపెట్టారు. ప్లాట్ లోకి వెళ్లి చూడగా కుళ్లిన స్థితిలో డెడ్ బాడీలు కనిపించాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సింధియా సెల్ ఆధారంగా డాక్టర్ రాణాను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయగా అసలు నిజాన్ని రాణా ఒప్పుకున్నాడు.
Also Read : మడత కాజా నిర్మాత వేదరాజు టింబర్ కన్నుమూత