/rtv/media/media_files/2025/01/31/ULPuFJR4Rt4GTxfwikd0.jpg)
leopard
తిరుమల (Tirumala) లో మరోసారి చిరుత (Leopard) సంచారం తీవ్ర సంచలనం రేపుతోంది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. చిరుతను చూసిన భక్తులు.. ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పక్కన ఉన్నవారికి చెప్పడంతో వారు కూడా అలర్ట్ అయ్యారు.
Also Read: Jayalalitha: జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే...సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు!
Leopard Spotted At Tirumala
ఇక చిరుత సంచారానికి సంబంధించిన సమాచారాన్ని భక్తులు.. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు తెలియజేశారు. వెంటనే టీటీడీ అధికారులు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం తెలియజేశారు. హుటాహుటిన వారంతా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఇక ఈ చిరుత.. తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల క్యూలైన్ల సమీపంలోనే సంచరిస్తున్నట్లు టీటీడీ, అటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులను టీటీడీ అధికారులు అప్రమత్తం చేశారు. చిరుత సంచారం నేపథ్యంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దర్శనాల కోసం వచ్చే భక్తులు ఒంటరిగా వెళ్లొద్దని.. గుంపులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ అధికారులు హితవు పలికారు. తిరుమలలో మరోసారి చిరుత సంచరిస్తుండటంతో.. శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళ్లిన భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.