/rtv/media/media_files/2025/01/31/s4rn9eoxSt6bKfEMQnGd.jpg)
Stocks
స్టాక్ మార్కెట్..ఇదో పెద్ద సముద్రం. ఇందులో ఎప్పుడు, ఎలా లాభాలు వస్తాయో చెప్పడం కష్టమే. ఏ షేర్ ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో..ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు. కానీ మార్కెట్ నిపుణులు, బ్రకరేజీలు ఎప్పటికప్పుడు షేర్ల మీద స్టడీ చేస్తూనే ఉంటారు. స్టాక్ మార్కెట్ షేర్లను అంచనా వేయడం కష్టమే కానీ...కొన్ని స్టాక్స్, షేక్లు మాత్రం పరిస్థితులు ఎలా ఉన్నా లాభాలనే తెచ్చిపెడతాయి. వీటినే గ్యారంటీ స్టాక్స్ అంటారు. ఇలాంటివి ఏడాది మొత్తం మదుపర్లకు లాభాలనే తీసుకువస్తాయి.
ఐదు స్టాక్స్ ఇవే..
2025లో ఏడాది మొత్తం ఏ స్టాక్స్ లాభాలు తెచ్చి పెడతాయనేది బ్రోకరేజిలు లిస్ట్ ఇచ్చాయి. మొత్తం ఐదు స్టాక్స్ మీద పెట్టుబడి పెడితే ఏడాది మొత్తం 15 నుంచి 40 శాతం వరకూ లాభాలను సంపాదించవచ్చని చెబుతున్నాయి. వీటిల్లో మొదటి స్థానంలో ఎస్బీఐ కార్డ్స్, అండ్ పేమెంట్ సర్వీసెస్ ఉంది. నువామా SBI కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్‌పై కొనుగోలు రేటింగ్ రూ. 850గా ఉంది. ఇది చివరిగా ట్రేడైన ధర రూ. 758. అక్కడ నుంచి 16% ఈ స్టాక్ పెరిగింది. దీని తర్వాత రెండో స్థానంలో ఐటీసీ షేర్స్ ఉన్నాయి. జెఫరీస్ ITCలో స్టాక్స్ రూ. 550 ధర ఉంది. ఇది చివరిగా ట్రేడైన ధర రూ. 435. అంటే దాదాపు 26 శాతం ఈ స్టాక్ పెరిగింది. వీటిల్లో గ్రోత్ ఒక పద్ధతిలో ఉందని..ష్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ఇవి లాభాలను తెచ్చి పెడతాయని చెబుతున్నారు.
వీటి తర్వాత మోర్గాన్ స్టాన్లీ సుజ్లాన్ ఎనర్జీ స్టాక్స్ కూడా మంచి పెట్టుబడే అని చెబుతున్నారు. దీని ప్రస్తుత టార్గెట్ ధర 71 రూ.లుగా ఉంది. చివరిగా ఇది ట్రేడ్ అయిన ధర 50 రూ. అంటే దీని పెరుగుదల 50 శాతంగా ఉంది. ఈ ఏడాదిలో లాభాలు తెచ్చే మరో స్టాక్..జెఫరీస్ కేన్స్ టెక్నాలజీ. దీని ప్రస్తుత ధర 5, 400 రూ.లు. జెఫరీస్ కేన్స్ టెక్నాలజీని "కొనుగోలు" రేటింగ్‌కి అప్‌గ్రేడ్ చేసింది, అయితే దాని టార్గెట్ ధరను రూ. 6,950 నుండి రూ. 5,400కి సవరించింది, ఇది చివరిగా ట్రేడ్ చేయబడిన ధర రూ. 4,666 నుండి 15% సంభావ్య పెరుగుదలను సూచిస్తుంది. తరువాతి స్టాక్ బజాజ్ నువామా. దీని టార్గెట్ ధర 10,700 రూ. ఇది చివరిగా ట్రేడ్ అయిన ధర 8, 392రూ. అంటే 27 శాతం ఈ స్టాక్ పెరిగింది.
Also Read: SSMB 29: ఎస్ఎస్ఎమ్బీలో ప్రియాంక చోప్రా..దీని వెనుక స్కెచ్ పెద్దదే..