Stock Market: నిన్న ఫుల్ బూమ్...ఈరోజు ఫుల్ లాస్‌లో స్టాక్ మార్కెట్

నిన్న నిఫ్టీ ఆల్ టైమ్ హై ని చూసింది. కానీ ఇవాళ అంతకంతా కిందకు పడిపోయింది. ఉదయం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలు ఎర్ర రంగును పూసుకున్నాయి.సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా పడిపోయి 84,450 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 50 పాయింట్లు తగ్గి 25,850 వద్ద ట్రేడవుతోంది.

New Update
stock

నిన్నటి లాభాల ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఈరోజు భారత స్టాక్ మార్కెట్లో(indian-stock-market) సూచీలు సానుకూల ధోరణితో ట్రేడింగ్ ప్రారంభించాయి. కానీ ఇది ఎక్కువ సేపు కొనసాగలేదు. రెండు ప్రధాన సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. దాంతో పాటూ సెన్సెక్స్(sensex-today) 100 పాయింట్లకు పైగా పడిపోయి 84,450 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ(nifty) దాదాపు 50 పాయింట్లు తగ్గి 25,850 వద్ద ట్రేడవుతోంది.సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో ఇరవై మూడు స్టాక్‌లు క్షీణించాయి. హిందూస్తాన్ యూనిలీవర్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ 3.5% వరకు పడిపోయాయి.వాటితో పాటూ పవర్ గ్రిడ్, టైటాన్ కూడా నష్టాల్లో ఈదులాడుతున్నాయి.  నిఫ్టీలోని 50 స్టాక్‌లలో ముప్పై రెండు స్టాక్‌లు క్షీణించాయి. NSEలో FMCG, బ్యాంకింగ్, ఫార్మాస్యూటికల్, హెల్త్‌కేర్ రంగాలు క్షీణించాయి. ఆటో , మెటల్ స్టాక్‌లు పెరిగాయి. 

Also Read :  గుడ్‌న్యూస్.. బ్యాంకు ఖాతాలపై కీలక అపడేట్

లాభాల్లో అంతర్జాతీయ మార్కెట్లు..

భారత మార్కెట్లు నేపచూపులు చూసతుంటే..అంతర్జాతీయ మార్కెట్లు మాత్రం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆసియా మార్కెట్లు బాగా పెరిగాయి. ఆసియా మార్కెట్లలో, కొరియా కోస్పి 1.96% పెరిగి 3,920 వద్ద మరియు జపాన్ నిక్కీ 1.35% పెరిగి 49,299 వద్ద ట్రేడవుతున్నాయి.హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.47% పెరిగి 26,090 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.42% పెరిగి 3,938 వద్ద ట్రేడవుతున్నాయి. అక్టోబర్ 23న US డౌ జోన్స్ 0.31% పెరిగి 46,734 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.89% , S&P 500 0.58% లాభపడ్డాయి.

Also Read :  ఆల్‌టైమ్‌ హైలో నిఫ్టీ..భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Advertisment
తాజా కథనాలు