stock Market: ఆల్‌టైమ్‌ హైలో నిఫ్టీ..భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఈమధ్య కాలంలో లేనంతగా నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టాను చూస్తోంది. ఇండియా, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదురుతున్నాయన్న వార్తలతో మార్కెట్ ఈరోజు లాభాలను చూస్తోంది. నిఫ్టీ కూడా 220 పాయింట్లు పెరిగి 26,090 వద్ద ఉంది.

New Update
Stock Market Bull

Stock Market Bull

అమెరికా, భారత్‌ల మ్య వాణిజ్య ఒప్పందాలు మళ్ళీ ఒక కొలిక్కి వస్తాయ్న వార్తలు స్టాక్ మార్కెట్లో జోష్ ను నింపాయి. సుంకాలను 50% నుండి 15%కి తగ్గించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. దానికి తోడు దేశీ మదుపర్లు మార్కెట్‌కు భారీగా మద్దతు అందుతోంది. దీంతో దేశీయ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. అమెరికా డాలర్ బలోపేతం కావడం కూడా మార్కెట్ పెరగడానికి కారణంగా అయింది. ప్రస్తుతం నిఫ్టీ ఆల్ టైమ్ హై లో ఉంది. సెన్సెక్స్ 750 పాయింట్లు పెరిగి 85,200 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 220 పాయింట్లు పెరిగి 26,090 వద్ద ఉంది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రెండూ  తమ ఆల్-టైమ్ గరిష్టాలను చేరుకుంటున్నాయి. నిఫ్టీ సూచీలో టెక్‌ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్‌, టాటా స్టీల్‌, కొటక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. 

మిశ్రమంగా అంతర్జాతీయ మార్కెట్లు..

ఆసియా మార్కెట్లలో, కొరియా కోస్పి 0.39% పెరిగి 3,898 వద్ద, జపాన్ నిక్కీ 1.30% తగ్గి 48,664 వద్ద ముగిశాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.081% తగ్గి 25,760 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.66% తగ్గి 3,888 వద్ద ట్రేడవుతున్నాయి. అక్టోబర్ 22న US డౌ జోన్స్ 0.71% తగ్గి 46,590 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.93%,  S&P 500 0.53% పడిపోయాయి. అక్టోబర్ 21న విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) నగదు విభాగంలో ₹96.72 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ పెట్టుబడిదారులు (DIIలు) ₹607 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

Advertisment
తాజా కథనాలు