/rtv/media/media_files/2025/10/23/bank-customers-now-opt-for-up-to-four-nominees-in-their-accounts-2025-10-23-21-17-32.jpg)
bank customers now opt for up to four nominees in their accounts
బ్యాంకు ఖాతాలకు సంబంధించి కీలక అపడ్‌డేట్ వచ్చింది. ఖాతాదారులు ఇకనుంది తమ బ్యాంకు అకౌంట్‌కు నలుగురు నామినీలను నియమించుకోవచ్చు. ఈ నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందుకోసం బ్యాంకింగ్ చట్టాల సవరణ చట్టం, 2025లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. అయితే కస్టమర్ తన మరణానంతరం అకౌంట్లో ఉన్న డబ్బును ఎవరికి చెల్లించాలనే విషయాన్ని అకౌంట్ ఒపెన్ చేసేటప్పుడు చెప్పాల్సి ఉంటుంది.
Also Read: సుప్రీం కోర్టుకు కొత్త CJI.. బీఆర్ గవాయ్ తర్వాత ఆయనకే బాధ్యతలు!
ప్రస్తుతం చూసుకుంటే ఒకరికి మాత్రమే బ్యాంకు అకౌంట్‌కు నామినీగా ఉంచే అవకాశం ఉంది. ఇకనుంచి మాత్రం ఏకంగా నలుగురిని నామినీలుగా పెట్టుకునేలా మార్పులు చేశారు. అంతేకాదు ఈ నామినీలను ప్రాధాన్యత ఆధారంగా ఒకరి తర్వాత ఒకరికి చెందేలా చేసుకునే సదుపాయం ఉంది. అంటే 100 శాతంలో ఎవరికి ఎంత ఇవ్వాలో చెప్పే పద్ధతి. అలాగే నామినీలుగా పేర్కొన్న వ్యక్తుల్లో మొదటి వ్యక్తి చనిపోతే రెండో వ్యక్తి, అతడు మరణిస్తే మూడో వ్యక్తికి, ఇతడు మరణిస్తే నాలుగో వ్యక్తికి ఇలా కూడా సొమ్మును అందించే నిబంధన ఉంది.
Also Read: గాల్లో ఉండగా కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్
ఇదిలాఉండగా బ్యాంకింగ్ సవరణ చట్టాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 15న నోటిఫై చేశారు. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జులైలో జారీ అయ్యింది. ఇందులో కొన్ని నిబంధనలు ఆగస్టు 1 నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే నామినేషన్‌కు సంబంధించిన రూల్స్ మాత్రం నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Finance Ministry: From Nov 1, 2025, new provisions under the Banking Laws (Amendment) Act, 2025 allow up to 4 nominees per account, boosting flexibility and depositor protection#BankingLaws#DepositorProtection#Finance#Governance#BankingUpdates#IndiaFinancepic.twitter.com/5MpIRfKsI8
— ET NOW (@ETNOWlive) October 23, 2025
Also Read: అమెరికాలో ముగ్గురి చావుకు కారణమైన భారతీయుడు.. భయంకరమైన VIDEO
Follow Us