GST Tax Slabs Changes: ఇకపై ఏసీ, టీవీలు, ఎలక్ట్రానిక్స్ చౌక చౌక.. ఈ రేట్లు అస్సలు ఊహించలేరు..!

కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ వస్తువులపై GST రేట్లను తగ్గించింది. ఎయిర్ కండీషనర్లు, పెద్ద టీవీలు, డిష్‌వాషర్‌ల ధరలు 28% నుంచి 18%కి తగ్గుతాయి. ఈ నిర్ణయం పండుగ సీజన్‌కు ముందు వినియోగదారులకు పెద్ద ఊరట. నూతన రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి.

New Update
GST Tax Slabs Changes electronics ac smart tv price down

GST Tax Slabs Changes electronics ac smart tv price down

దీపావళి, సంక్రాంతి పండుగకు ముందు కేంద్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. బుధవారం న్యూఢిల్లీలో 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జీఎస్టీ పన్ను శ్లాబ్‌లో ప్రధాన నిర్ణయాలు తీసుకుని మార్పులు చేశారు. ఇందులో భాగంగానే GST లో కేవలం రెండు శ్లాబ్ లను మాత్రమే కంటిన్యూ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

GST Tax Slabs Changes

ఈ నిర్ణయం తర్వాత రైతులు, సామాన్య ప్రజలకు బిగ్ రిలీఫ్ అందింది. సామాన్యులు కొనుక్కునే చిన్న చిన్న వస్తువులు ఇకపై తక్కువ ధరకే లభించబోతున్నాయి. కాగా విలాసవంతమైన వస్తువులపై యధావిధిగా పన్ను 40 శాతం ఉండనుంది. కానీ మిగతా వస్తువులపై మాత్రం 5, 18 శాతాల జీఎస్టీని అమలు చేయనున్నారు. దీనిని ఈ నెల అంటే సెప్టెంబర్ 22వ తేదీ నుండి అమల్లోకి తీసుకురానున్నారు. 

Also Read : ఎయిరిండియా స్పెషల్ సేల్.. అతి తక్కువ ధరకే విలాసవంతమైన అంతర్జాతీయ ప్రయాణం!

ఈ కొత్త జీఎస్టీ శ్లాబ్ రేట్స్‌ మార్పుల కారణంగా స్మార్ట్‌ టీవీలు, ఎయిర్ కండీషనర్లు (ఏసీ), ఎలక్ట్రానిక్ డిష్ వాషర్లు సహా మిగతా వస్తువులు అతి తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఈ ఎలక్ట్రానిక్స్ వస్తువులపై 28% పన్ను విధించగా.. ఇప్పుడు 18% పన్ను అమల్లోకి రానుంది. ఈ కొత్త మార్పుల ప్రకారం.. ఇప్పటివరకు ఎయిర్ కండిషనర్లపై 28% GST విధించగా.. ఇప్పుడు 18% GST విధించబడుతుంది. అలాగే టెలివిజన్లు ఇప్పటివరకు 28% స్లాబ్‌లో ఉంది. ఇప్పుడు 18% GST పన్ను పరిధిలోకి రాబోతున్నాయి. ఈ కొత్త GST రేట్ల తర్వాత టీవీలు మరింత చౌకగా మారనున్నాయి. 

ఉదాహరణకు..

టీవీ బేస్ ధర = రూ. 10,000 అనుకుందాం.

పాత ధర (28% GST) = 10,000 × 1.28 = రూ. 12,800

కొత్త ధర (18% GST) = 10,000 × 1.18 = రూ. 11,800 

రూ. 1,000 డబ్బు ఆదా అవుతుంది.

అలాగే కొత్త జీఎస్టీ పన్ను తర్వాత ACలపై కూడా ధరలు తగ్గనున్నాయి. ఇంతకముందు 28%కి బదులుగా ఇప్పుడు 18% చేసిన తర్వాత.. వేల రూపాయలు ఆదా అవుతాయి. 

Also Read : జొమాటో యూజర్లకు బిగ్ షాక్.. ఒక్కో ఆర్డర్‌పై భారీగా పెంచిన ఫీజులు!

ఉదాహరణకు..

AC బేస్ ధర = రూ. 30,000 అనుకుందాం.

పాత ధర (28% GST) = రూ. 30,000 × 1.28 = రూ. 38,400

కొత్త ధర (18% GST) = రూ. 30,000 × 1.18 = రూ. 35,400 

రూ. 3,000 ఆదా అవుతుంది. 

దీంతో పాటు డిష్ వాషింగ్ మెషీన్లు కూడా చౌకగా ఉంటాయి. అలాగే మానిటర్లు, ప్రొజెక్టర్లు కూడా చౌకగా మారనున్నాయి. ఈ మార్పు సామన్య ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది.

Advertisment
తాజా కథనాలు