/rtv/media/media_files/2025/09/18/epfo-introduces-single-login-system-to-enhance-member-access-and-satisfaction-2025-09-18-21-07-45.jpg)
EPFO introduces single login system to enhance member access and satisfaction
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి మెంబర్ పోర్టల్‌లో PF లావాదేవీలు తెలుసుకునేలా పాస్‌బుక్ లైట్ పేరుతో ఓ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పాస్‌బుక్ కోసం స్పెషల్‌గా పోర్టల్‌లో లాగిన్ అయ్యే అవసరాన్ని తగ్గించింది. ఇకనుంచి సింగిల్ లాగిన్‌తోనే EPFOకు సంబంధించి అన్ని సేవలు, PF ఖాతా వివరాలను తెలుసుకోవచ్చు. ఈ విషయాన్ని కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు.
Also Read: కంగనా రనౌత్‌ని చెంపదెబ్బ కొట్టాలి.. కాంగ్రెస్ లీడర్ వివాదాస్పద వ్యాఖ్యలు
EPFO Introduces Single Login System
సాధారణంగా EPFO సేవలు పొందడం కోసం ముందుగా EPF మెంబర్ పోర్టల్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. EPF ఖాతా బ్యాలెన్స్, లావాదేవీలు, విత్‌డ్రాలు వంటి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా పాస్‌బుక్ పోర్టల్ తెరవాలి. అయితే ఇకనుంచి ఆ అవసరం ఉండదు. ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్‌లోనే పాస్‌బుక్ లైట్ పేరిత కొత్త సదుపాయాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఇందులో ఫీఎఫ్ కాంట్రిబ్యూషన్, విత్‌డ్రా, బ్యాలెన్స్ లాంటి వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే సమగ్ర వివరాలు, గ్రాఫిక్స్‌తో కూడిన సమాచారం కావాలంటే పాస్‌బుక్ పోర్టల్‌ను వినియోగించుకోవచ్చు. దీనివల్ల యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే సింగిల్ లాగిన్‌తో మరిన్ని ముఖ్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు.
Also Read: ట్రంప్ మరో షాక్.. భారతీయ వ్యాపారుల వీసాలు రద్దు
PF సేవల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు అనెక్సర్-K (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్) ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉద్యోగులు ఎవరైనా ఉద్యోగం మారితే వాళ్ల PF ఖాతాలు వేరే పీఎఫ్ ఆఫీసుకు బదిలీ అవుతాయి. ఈ క్రమంలోనే పాత పీఎఫ్ ఆఫీసు నుంచి కొత్త ఆఫీసుకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ వెళ్తుంది. ఇప్పటిదాకా ఈ సర్టిఫికేట్ అనేది కేవలం పీఎఫ్ కార్యాలయాల్లో మాత్రమే అందుబాటులో ఉంటోంది. సభ్యులు అడిగినప్పుడు మాత్రమే దీన్ని అందిస్తున్నారు. ఇకనుంచి మెంబర్ పోర్టల్‌లో PDF ఫార్మాట్‌లో అందుబాటులో ఉండనుంది.
Also Read: శత్రు దేశాలే టార్గెట్.. మరో సంచలన ఆయుధాన్ని తయారుచేసిన ఇజ్రాయెల్
దీనివల్ల PF బదిలీ సమాచారంతో సహా PF బ్యాలెన్స్, సర్వీసు వివరాలు సరిగా అప్‌డేట్ అయ్యాయో లేదో సభ్యులు చెక్ చేసుకోవచ్చు. ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ (EPS) ప్రయోజనాలు అందుకునే విషయంలో కూడా డిజిటల్ రికార్డుగా కూడా దీన్ని వినియోగించవచ్చు. ప్రస్తుతం చూసుకుంటే పీఎఫ్ ట్రాన్స్‌ఫర్లు, సెటిల్‌మెంట్లు, అడ్వాన్సులు, రిఫండ్ లాంటి సేవలకు RPFC/ఆఫీసర్ ఇన్‌ఛార్జి స్థాయి అధికారుల ఆమోదం ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ అంశంలో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఆ బాధ్యతలను అసిస్టెంట్ పీఫ్ కమిషనర్, సబార్డినేట్ స్థాయి ఉద్యోగులకు సైతం బదిలీ చేసింది. దీనివల్ల సెటిల్‌మెంట్లు త్వరగా పూర్తవుతాయని అలాగే ప్రాసెసింగ్ సమయం కూడా తగ్గుతుందని కేంద్రమంత్రి మాన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.
Also Read: చింతమడకలో ఎంగిలి పూలు.. లండన్ లో సద్దులు.. కవిత బతుకమ్మ షెడ్యూల్ వచ్చేసింది!