Israel: శత్రు దేశాలే టార్గెట్‌.. మరో సంచలన ఆయుధాన్ని తయారుచేసిన ఇజ్రాయెల్‌

రక్షణ వ్యవస్థను మెరుగుపర్చుకునేందుకు ఇజ్రాయెల్‌ కీలక అడుగులు వేస్తోంది. తక్కువ ఖర్చుతో శత్రు దేశానికి ఎక్కువ నష్టం కలిగించే ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలోనే కొత్త లేజర్‌ ఆధారిత వాయు రక్షణ వ్యవస్థ ఐరన్‌ బీమ్‌ను విజయవంతంగా పరీక్షించింది.

New Update
Israel’s new ‘Iron Beam’ laser system to stop drones and rockets at Light Speed

Israel’s new ‘Iron Beam’ laser system to stop drones and rockets at Light Speed

ప్రపంచంలో అత్యంత పటిష్ఠమైన రక్షణ వ్యవస్థ కలిగిన దేశాల్లో ఇజ్రాయెల్(israel) ఒకటి. ఐరన్‌ డోమ్(Iron Beam) సిస్టమ్‌తో శత్రువుల దాడులను తిప్పికొట్టగల సామర్థ్యం కలిగి ఉంది.  డేవిడ్స్ స్లింగ్, ఆరో -3 వంటి బహుళ-అంచెల క్షిపణి రక్షణ వ్యవస్థలు కూడా ఉన్నాయి.  F-35, F-16 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులు, హెలికాప్టర్లతో బలమైన రక్షణ వ్యవస్థ కలిగిన దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది. గూఢచర్యం, నిఘా వంటి కార్యకలాపాల్లో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్‌ మరో కీలక అడుగులు వేస్తోంది. తక్కువ ఖర్చుతో శత్రు దేశానికి ఎక్కువ నష్టం కలిగించే ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. 

Also Read: ఫోన్‌కు అశ్లీల వీడియోలు.. నడిరోడ్డుపై బస్సు డ్రైవర్‌ను చితకబాదిన మహిళలు

Israel’s New ‘Iron Beam

ఈ క్రమంలోనే కొత్త లేజర్‌ ఆధారిత వాయు రక్షణ వ్యవస్థ ఐరన్‌ బీమ్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఈ ఏడాది ఈ సాంకేతికతను మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ టెక్నాలజీ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే సాధారణ ఇంటర్‌సెప్టర్‌ మిసైల్‌ను ప్రయోగించేందుకు దాదాపు 50 వేల డాలర్లు (రూ.44 లక్షలు) ఖర్చవుతుంది. కానీ ఈ లేజర్‌ ఆధారిత ఐరన్‌ బీమ్‌ ద్వారా లక్ష్యాన్ని చాలా తక్కువ ఖర్చుతోనే చేధించవచ్చు. అంటే ఈ రక్షణ వ్యవస్థ ద్వారా శత్రు దేశం నుంచి వచ్చే రాకెట్లు, డ్రోన్‌లు అడ్డుకుని తమ ఆయుధాలను, ఖర్చును గణనీయంగా పొదుపు చేస్తుంది. భారత్‌ కూడా ప్రస్తుతం ఇజ్రాయెల్ సాంకేతికపైనే పనిచేస్తోంది. అలాగే ఇలాంటి ఆయుధాలు అభివృద్ధి చేస్తోంది. 

Also Read: భారత్ పై ట్రంప్ యూటర్న్.. సుంకాల్లో భారీ మార్పులు.. కొత్త లెక్కలు ఇవే!

ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఐరన్ బీమ్‌ ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో రాకెట్లు, డ్రోన్లు, ఇతర యుద్ధ విమానాలను విజయవంతంగా కూల్చేసింది. ఇప్పటికే ఇజ్రాయెల్‌కు ఐరన్‌ డోమ్‌, డేవిడ్స్ స్లింగ్ వంటి రక్షణ వ్యవస్థలు ఉండగా ఇప్పుడు ఐరన్‌ బీమ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ డిఫెన్స్ సిస్టమ్‌ తమ మొదటి యూనిట్లను అందుకుంటాయి. ఈ రక్షణ వ్యవస్థను ఎల్బిట్‌ సిస్టమ్స్‌, రాఫెల్ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఐరన్‌ బీమ్‌కు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాఫెల్‌ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ కంపెనీ ఛైర్మన్ యువల్ స్టెయినిట్స్‌ ఈ రక్షణ వ్యవస్థ ఆధునిక యుద్ధానికి ఓ గేమ్‌ఛేంజర్ అని పిలిచారు. ఈ సాంకేతిక వాయు రక్షణ సామర్థ్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని వ్యాఖ్యానించారు. ఈ డిఫెన్స్ సిస్టమ్‌ ఇజ్రాయెల్‌కు దగ్గర్లో ఏదైనా రాకెట్‌ గానీ డ్రోన్‌ గానీ వస్తే వెంటనే వాటిని టార్గెట్ చేసి కూల్చేస్తుంది.  

Also Read: బోయింగ్‌ కంపెనీకి బిగ్‌షాక్.. విమాన ప్రమాదంపై కేసు

భారత్‌లో కూడా ఇలాంటి సాంకేతికతో కూడా లేజర్‌ రక్షణ వ్యవస్థను కలిగిఉంది. డ్రోన్లు, హెలికాప్టర్లు, క్షిపణులు, ఇతర గగనతల టార్గెట్‌లను 5 కిలోమీటర్ల దూరం రేంజ్‌లో నాశనం చేయగలదు. 30 కిలోవాట్ల ఈ లేజర్‌ ఆయుధాన్ని డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. దీన్ని భూమిపైనే కాకుండా నౌకలపై కూడా ప్రయోగించవచ్చు. ఈ సాంకేతికతను భారత్‌ మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోంది.  

Advertisment
తాజా కథనాలు