/rtv/media/media_files/2025/09/18/mlc-kalvakuntla-kavitha-2025-09-18-18-30-11.jpg)
తెలంగాణ ప్రజలు మాత్రమే ప్రత్యేకంగా జరుపుకునే ప్రకృతి పండుగ.. బతకమ్మ(Bathukamma 2025) రానే వచ్చేసింది. ఈ నెల 21 నుంచి ఎంగిలి పూల బతుకమ్మతో ఈ పండుగ వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే.. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బతుకమ్మ వేడుకలను తనదైన శైలిలో నిర్వహిస్తూ ప్రత్యేకత చాటారు కల్వకుంట్ల కవిత(kalvakuntla-kavitha). బతుకమ్మను తెలంగాణ ఉద్యమంలో భాగం చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు కవిత. అయితే.. బీఆర్ఎస్(brs) కు ఆమె దూరం కావడంతో పాటు కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం నేపథ్యంలో ఈ సారి కవిత బతుకమ్మ వేడుకలను ఎక్కడ, ఎలా నిర్వహిస్తారన్న అంశంపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కవిత తన బతుకమ్మ షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ నెల 21న కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో నిర్వహించనున్న ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పర్యటన వివరాలు:
— Kavitha Manohar (@ManoharKolakani) September 18, 2025
21న ఎంగిలిపూల బతుకమ్మ - చింతమడక (సిద్దిపేట జిల్లా)
22న తెలంగాణ జాగృతి కార్యాలయం - హైదరాబాద్
23న శ్రీరాంపూర్ (మంచిర్యాల జిల్లా)
(1/2)#KalvakuntlaKavitha#TelanganaJagruthipic.twitter.com/7oDdSdiNqK
Also Read : ఆత్మగౌరవం పోయాక పదవులు ఎందుకు.. ఈటల సంచలన కామెంట్స్!
కవిత బతుకమ్మ షెడ్యూల్..
- 21న ఎంగిలిపూల బతుకమ్మ - చింతమడక (సిద్దిపేట జిల్లా)
- 22న తెలంగాణ జాగృతి కార్యాలయం - హైదరాబాద్
- 23న శ్రీరాంపూర్ (మంచిర్యాల జిల్లా)
- 24న సిద్దిపేట జిల్లాలోని వర్గల్ అమ్మవారి దర్శనం
- 25న హర్యానా లో మాజీ ఉప ప్రధాని దేవిలాల్ 112వ జయంతి ఉత్సవాలకు హాజరు
26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విదేశాల్లో బతుకమ్మ వేడుకలకు హాజరు
- 26న ఖాతార్
- 27న మాల్టా
- 28న లండన్
Also Read : రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన MLA రాజ్‌గోపాల్ రెడ్డి
ఇటీవల కవితను కేసీఆర్ స్వగ్రామం అయిన చింతమడక ప్రజలు వచ్చి కలిశారు. గ్రామంలో నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. ఈ మేరకు ఆమెకు ఆహ్వానం అందించారు. చింతమడక ఇప్పుడు సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఒకప్పుడు కేసీఆర్ కంచుకోటగా చెప్పబడే ఈ నియోజకవర్గం నుంచి ఇప్పుడు హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
సొంత ఊరు మనుషులను చూస్తే మస్త్ సంబురం అయితది..
— MANASA FOR KCR (@ManasaTelangana) September 11, 2025
మనం పుట్టి పెరిగిన అదే ఊరు నుంచి మన అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుక్కు పిలిస్తే ఇంకెంత ఆనందం అనిపిస్తది.
చింతమడక గ్రామ ప్రజలు ఈ నెల 21 వ తారీఖు జరిగే ఎంగిలి పూల బతుకమ్మకు ఆహ్వానించడం జరిగింది.@RaoKavitha… pic.twitter.com/VJmr4ECfzb
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు ప్రతీ సారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తూ వస్తున్నారు హరీష్ రావు. అయితే.. ఇప్పుడు అక్కడి నుంచి కవితకు ఆహ్వానం అందడం తెలంగాణ పాలిటికల్స్ లో ఆసక్తికరంగా మారింది. హరీష్ రావుపై కవిత తీవ్ర ఆరోపణలు చేస్తూ నిప్పులు చెరుగుతున్న సమయంలో కవిత చింతమడకకు వెళ్తుండడం హాట్ టాపిక్ గా మారింది. తండ్రి సొంత గడ్డపై కవిత ఏం మాట్లాడుతారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.