Prashant Kishor: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party)నే అధికారంలో రాబోతోందన్నారు. మరో 3 నెల్లల్లో దేశంలో తెలంగాణతో పాటు మరో 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయన్న ఆయన.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రానుందన్నారు. దీంతోపాటు రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టిపోటీ ఉంటుందన్నారు. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) గెలుస్తుందని అందరూ అనుకుంటున్నారని కానీ అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ అంతగా లేదన్నారు.
Also Read: INDIA కూటమి వరుస సమావేశాలు.. ఇవాళ రాత్రికి ఏం తేల్చబోతున్నారు?
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంఅమలు చేస్తున్న సంక్షేమ పథకాలే అందుకు నిదర్శనమన్నారు. గత 5 సంవత్సరాల్లో హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగిందన్నారు. తెలంగాణ రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు వస్తున్నాయన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రైతుల ఓటు బ్యాంకు అధికశాతం ఉపయోగపడుతుందన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) ఎకరాకు 5 వేల చొప్పున ప్రతీ సంవత్సరం ఎకరాకు 10 వేల రూపాయలను అందిస్తున్నారని, దీంతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా సాగుకు ఉచిత విద్యుత్ అందించడం, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి 365 రోజులు చెరువుల్లో నీరు ఉండేలా చేశారన్నారు.
రైతుబంధుతో పాటు రైతుబీమా (RYTHU BANDHU/BIMA) సైతం అందిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ పథకాలు రైతులకు బండ గుర్తులుగా ఉండిపోనున్నాయని, దీనివల్ల కేసీఆర్‌కు రైతుల ఓటు బ్యాంకు ఇతర పార్టీలకు వెళ్లకుండా ఉంటుందన్నారు. మరోవైపు ఈ ఏడాది రాజస్థాన్-మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గెలుపుకోసం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీల మధ్య గట్టిపోటీ ఉండబోతోందన్నారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ రాష్ట్రంలోని రాజకీయ విశ్లేషకులు అంటున్నారన్న ఆయన.. కానీ ఈ సారి కాంగ్రెస్ గెలుపు అంత సులువు కాదని, గెలుపుకోసం కాంగ్రెస్ ఇతర పార్టీలతో పోటీ పడాల్సి ఉండొచ్చని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
Also Read: కాంగ్రెస్‌లోకి తుమ్మల చేరికకు బ్రేక్.. పార్టీ మారుతారా?