Thummala Nageswara Rao Break to Join in Congress party: తెలంగాణలో ఖమ్మం(Khammam) జిల్లా రాజకీయాలు రోజుకో రకంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) కాంగ్రెస్(Congress) లోకి వెళ్లడం ఖరారయింది. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 6న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ లో చేరనున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఉన్నట్టుండి కాంగ్రెస్‌లో తుమ్మల చేరికకు బ్రేకులు పడ్డాయి. జాతక రీత్యా ఆరో తేదీన కలిసిరాకపోవడంతో చేరికను వాయిదా వేసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచించారట. జ్యోతిష్యాన్ని తప్పక పాటించే తుమ్మల ఇక చేసేదేమీ లేక తన చేరికను వాయిదా వేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ను కోరినట్లు తెలుస్తుంది. తుమ్మల మనవిని మన్నించిన కాంగ్రెస్ హైకమాండ్ ఈనెల 17వ తేదికి తన చేరికను వాయిదా వేసినట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Thummala Nageswara: కాంగ్రెస్‌లోకి తుమ్మల చేరికకు బ్రేక్.. పార్టీ మారుతారా?
కాంగ్రెస్‌లోకి తుమ్మల చేరికకు బ్రేక్‌లు పడ్డాయి. జాతక రీత్యా ఆరో తేదీన కలిసిరాకపోవడంతో చేరికను వాయిదా వేసుకోవాలని తుమ్మలకు జ్యోతిష్య పండితులు సూచించారట. జ్యోతిష్యాన్ని తప్పక పాటించే తుమ్మల ఇక చేసేదేమీ లేక తన చేరికను వాయిదా వేయాలని కాంగ్రెస్ హైకమాండ్‌ను కోరినట్లు తెలుస్తుంది. తుమ్మల మనవిని మన్నించిన కాంగ్రెస్ హైకమాండ్ ఈనెల 17వ తేదికి తన చేరికను వాయిదా వేసినట్లు సమాచారం.
Translate this News: