• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • నిజామాబాద్
  • విజయవాడ
  • వైజాగ్

Manogna alamuru

movies: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ లో ప్రభాస్, నయనతార

Published on September 23, 2023 9:50 pm by Manogna alamuru

మంచు మనోజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. స్టార్ ప్లస్ లో మహాభారత్ సీరియల్ తీసిన ముఖేశ్​ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో కన్నప్ప పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతోంది. డైలాగ్ కింగ్​ మోహన్‌బాబు, ఆయన తనయుడు విష్ణు కలిసి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్పగా నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కూడా గెస్ట్ రోల్​లో కనిపించనున్నారు. అది కూడా శివుడి పాత్రలో అని ప్రచారం సాగగా.. మంచు విష్ణు కూడా ఓ ట్వీట్​తో ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు.

అయితే ఇప్పుడిదే సినిమాలో నయనతార కూడా యాక్ట్ చేయనుందని తెలిస్తోంది. ఈ విషయాన్ని సీనియర్ నటి మధు బాల కన్ఫామ్ చేశారు. ఆమె తన కొత్త సినిమాల గురించి మాట్లాడుతూ.. ప్రభాస్-నయతార ప్రాజెక్ట్ లో భాగమయ్యానని చెప్పారు. దీంతో ప్రభాస్ శివుడి పాత్రకు జోడీగా నయన్​ పార్వతిగా కనిపించనుందని బయట టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట నూపుర్ సనన్ ఎంపిక చేశారు. కానీ డేట్స్ సర్దుబాటు అవ్వక ప్రాజెక్ట్ నుంచి వైదొలగింది.

యోగి సినిమా తర్వాత అంటే.. దాదాపు 16ఏళ్ల తర్వాత కలిసి మళ్లీ ప్రభాస్-నయన్​ నటిస్తున్నారు. కాగా, ఇప్పటికే నయన్​.. పలు సినిమాల్లో అమ్మవారిగా కనిపించి ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే కన్నప్ప చిత్రం విషయానికొస్తే.. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని రూపొందిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి స్వరాలు సమకూరుస్తున్నారు.

కన్నప్ప సినిమా మొత్తాన్ని న్యూజిలాండ్ లో జరగనుంది. ఒక్క షెడ్యూల్ లో మొత్తం సినిమాను పూర్తి చేస్తామని మంచు విష్ణు ఆల్రెడీ ప్రకటించారు. రీసెంట్ గా 800 మంది సిబ్బందితో 5 నెలల పాటూ ఆర్ట్ వర్క్ పూర్తి చేయించినట్లు విష్ణు చెప్పారు. దీనికి సంబంధించిన మొత్తం సామాగ్రిని 8 కంటెయినర్లలో న్యూజిలాండ్ కు తరలించారు. ఈ ఆర్ట్ వర్క్ కు సంబంధించి మేకింగ్ వీడియోను మూవీ టీమ్ సోషల్ మీడియాలో కూడా పంచుకుంది.

Actress Madhubala confirms Prabhas and Nayanthara being part of #Kannappa ❤

We're gonna witness this pair after 16 years 🛐#Nayanthara #Prabhas pic.twitter.com/BsID28kYEI

— N'cafe 💫 (@NayanCafe) September 23, 2023

bigboss:బిగ్ బాస్ నుంచి దామినీ అవుట్….బయటపడిన లీక్స్

Published on September 23, 2023 8:48 pm by Manogna alamuru

తెలుగు బిగ్ బాస్ -7 సీజన్ రెండు వారాలు పూర్తి చేసుకుని మూడవ వారం చివరకు వచ్చింది. శని, ఆది వారాల్లో నాగార్జు వచ్చి సందడి చేస్తాడు. అలాగే ఆది వారం ఒకరిని హౌస్ నుంచి ఎలిమినేట్ కూడా చేస్తాడు. ఈ సీజన్ ఉల్టా-పుల్టా అంటూ ఆటను నడిపిస్తున్నారు. దాంతో ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే కంటెస్టెంట్స్ నుంచి హౌస్ మేట్స్ గా మారారు. ఇద్దరు హౌస్ మేట్స్ అవ్వకుండానే బయటకు వెళ్ళిపోయారు. కిరణ్ రాథోడ్ మొదటి వారంలో, షకీలా రెండవ వారంలో ఎలామినేట్ అయిపోయారు. హౌస్ మేట్స్ గా డాన్స్ మాస్టర్ సందీప్, శివాజీలు అయ్యారు.

ఈవారం ఎలిమినేషన్స్ లిస్ట్ లో 7గురు ఉన్నారు. సింగర్ దామిని, అమర్ దీప్, ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, శుభశ్రీలు ఉన్నారు. వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో తెలియాలి. కంటెంట్, ఫాలోయింగ్, ఎక్స్ ట్రా కల్చరల్ యాక్టివిటీస్ పరంగా ఓట్లు పడతాయి. సోషల్ మీడియాలో వస్తున్న లీక్స్ ప్రకారం లేడీ కంటెస్టెంట్ దామిని ఈ వీక్ ఎలిమినేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. వారికి వచ్చిన ఓట్ల ఆధారంగా చూస్తే ఈ వారం దామిని ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

దామిని ఎలిమినేషన్ వెనుక చాలా కారణాలే ఉన్నాయి. రెండు వారాల పాటు కామ్ గా, ఏ రచ్చ లేకుండా, వివాదాలకు దూరంగా ఉన్న ఆమె.. ఎక్కువగా వంట గదికే పరిమితమైంది. అంతేకాదు.. హౌస్ యాక్టివిటీల్లో కూడా ఎక్కువగా కనిపించలేదు. ఇక ఇప్పటివరకు జరిగిన ఆరు సీజన్స్ లో వంట రూమ్ కు పరిమింతం అయినవాళ్ళే త్వరగా ఎలిమినేట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు దామిని విషయంలో ఇదే జరిగిందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. బిగ్ బాస్ అఫీషియల్ ఓటింగ్ లో దామికి కేవలం 4 శాతం ఓట్లు మాత్రమే పడ్డట్లు సమాచారం. మరోవైపు తాజాగా ఓ టాస్క్ లో దామిని చూపించిన తీరుకు కూడా ఆడియన్స్ నెగటివ్ ఓట్లు వేశారని తెలుస్తోంది. అదే దామినికి పెద్ద మైనస్ పాయింట్ అయిందని సమాచారం.

బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో దామిని యావర్ నోట్లో పేడ కొట్టడం, హింసించడంతో ఆమెపై నెగిటివిటీ పెరిగిపోయింది. కంటెండర్ టాస్కుల్లో ఆమెకు ఎక్కువ కంటెంట్ ఇచ్చే అవకాశం లభించలేదు. దీంతో స్క్రీన్ స్పేస్ తగ్గడంతో ఆమెకు ఎక్కువ ఓట్లు పడలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఫస్ట్ వీక్ నుంచి ప్రిన్స్ యావర్ ఎవరిని నామినేట్ చేస్తే వారు హౌస్ నుంచి బయటకు వస్తున్నారన్న రూమర్ సోషల్ మీడియా జోరుగా వినిపిస్తోంది. అయితే మొదటి వారం ఎలిమినేట్ అయిన కిరణ్ రాథోడ్ ను యావర్ నామినేట్ చేయలేదు. రెండో వారం ఆయన నామినేట్ చేసిన షకీలా హౌస్ నుంచి బయటకు వచ్చింది. తాజాగా థర్డ్ వీక్ లో యావర్ దామినిని నామినేట్ చేయడంతో ఆమె ఎలిమినేట్ అయింది.

 

movies:అబ్బా…నేషనల్ క్రష్ రష్మిక భలే ఉందిగా…

Published on September 23, 2023 7:34 pm by Manogna alamuru

రణబీర్ కపూర్ యానిమల్ మూవీ ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది మూవీ టీమ్. ఇందులో భాగంగా మూవీలోని ప్రధాన పాత్రల పోస్టర్లను ఒక్కొక్కరివీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రణబీర్ లుక్ రివీల్ చేశారు. రీసెంట్ గా సీనియర్ నటుడు అనిల్ కపూర్ లుక్ కూడా విడుదల చేశారు. తాజాగా ఈ మూవీలో హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మికా మందన్నా లుక్ రిలీజ్ చేశారు. చక్కగా చీర కట్టుకొని, చాలా కూల్ గా కనపడుతున్న రష్మిక లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.

మొట్టమొదట రిలీజ్ చేసిన రణబీర్ లుక్ మాత్రం చాలా భయంకరంగా ఉంది. టైటిల్ కి తగినట్లుగానే రణబీర్ ని ఒంటినిండా రక్తంతో ఉన్నట్లు చూపించారు. కానీ రష్మిక లుక్ మాత్రం చాలా బావుంది అనే టాక్ ను తెచ్చుకుంది. దాంతో పాటూ పిక్ కింద ఇచ్చిన క్యాప్షన్ కూడా అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ప్రపంచానికి అతను ఎంత వైల్డ్ అయినా, అతనికి మాత్రం ఆమే ప్రపంచం అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో యానిమల్ మూవీలో హీరోయిన్ రోల్ ఎంత బలమైనదో తెలుస్తోంది అంటున్నారు.

rashmika

యానిమల్ మూవీని తెలుగు సినిమా అర్జున్ రెడ్డితో పోలుస్తున్నారు. అర్జున్ రెడ్డి మూవీలోనూ హీరో చాలా కోపంగా ఉంటాడు. హీరోయిన్ మాత్రం చాలా కూల్ గా, ప్రశాంతంగా, పక్కింటి అమ్మాయిలా కనపడుతుంది. ఇప్పుడు దీనిలోనూ అదే ఫార్ములా డైరెక్టర్ ఫాలో అయ్యాడు అనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే అర్జున్ రెడ్డి సినిమాను తీసిన వంగా సందీప్ రెడ్డినే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ ని ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు.ఇక, యానిమల్ సినిమాను డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ 1 స్టూడియోస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.యానిమల్ సినిమా చాలా హింసాత్మకంగా సాగుతుందనే ప్రచారం జరుగుతోంది. గ్యాంగ్‌స్టర్ కథాంశంతో యానిమల్ సినిమా మోస్ట్ వైలెంట్ గా రానుంది.

PM Modi:ఈనెల 30న పాలమూరుకు ప్రధాని మోదీ

Published on September 23, 2023 7:14 pm by Manogna alamuru

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 2వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా దాన్ని రెండు రోజుల ముందుకు అంటే సెప్టెంబర్ 30 కు మార్చారు. అక్టోబర్ 2 న రావాల్సి ఉండగా దాన్ని కొంచెం ముందుకు జరిపారు. మహబూబ్ నగర్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. 30వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు పాలమూరులో ఐటీఐ గ్రౌండ్ లో సభ ఉండనుంది. ప్రధాని మోదీ సభను 2023 ఎన్నికల శంఖారావం సభగా బీజెపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. ఈ సభను తెలంగాణ బీజెపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కనీసం లక్ష మందిని సభకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

భారీ బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర బీజెపీ నేతలు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తల్లోజు ఆచారి పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజెపీ గెలిచేలా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్ళి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ లకంటే తమ పార్టీనే బెటర్ అని ప్రజలకు ప్రచారం చేస్తున్నారు.

అలాగే అక్టోబర్ 3 న నిజామాబాద్ కు కూడా ప్రధాని మోదీ రానున్నారు. ఇక్కడ కూడా బహిరంగ సభ లేదా రోడ్ షో ఉండవచ్చని లోకల్ బీజెపీ నేతలు చెబుతున్నారు.
దీనికి సంబంధించి అక్టోబర్ 1 న బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంటుందని తెలిపారు. దీనికి
రాష్ట్ర పదాదికారులు, జిల్లా అధ్యక్షులు , జిల్లా ఇంఛార్జి లు , పార్లమెంట్ ఇంఛార్జి లు, అసెంబ్లీ కన్వీనర్ లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు.

 

amazon prime:ఇక మీదట ఓటీటీల్లోనూ ప్రకటనలు తప్పవంట…

Published on September 23, 2023 6:29 pm by Manogna alamuru

ప్రస్తుతం వినోదం మన చేతుల్లోనే ఉంది. సినిమాలు చూడాలంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఫోను, టీవీ, ల్యాప్ టాప్ ఏది ఉన్నా చాలు…అందులో ఓటీటీలు పెట్టుకోవడం ఎంచక్కా చూసేయడం. కరోనా తర్వాత ఓటీటీలకు జనాలు మరింత ఎక్కువగా అలవాటు పడిపోయారు. నెలకు ఇంత కడితే చాలు హాయిగా అన్నీ చూసేయొచ్చు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్స్…ఇలాంటివి చాలానే ఉన్నాయి. వీటిల్లో ప్రస్తుతం జియో సినిమాలు ఒక్కటే ఉచితంగా కంటెంట్ ను అందిస్తోంది. అయితే ఇప్పుడు నెమ్మదిగా ఓటీటీలు తమ రంగును మార్చుకుంటున్నాయి. ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనలూ లేకుండా కంటెంట్ ను అందిస్తోన్న ఓటీటీలు నెమ్మదిగా యాడ్స్ వైపు అడుగులు వేస్తున్నాయి.

డిస్నీ హాట్ స్టార్స్ ఎప్పటి నుంచో సినిమా, సీరీస్ ల మధ్యలో యాడ్స్ ను ఇస్తోంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కు కూడా అదే బాట పట్టనుందని తెలుస్తోంది. దీని ప్రకారం వీటిల్లో సినిమా లేదా సీరీస్ చూడ్డం మొదలెట్టగానే యాడ్ వస్తుంది. దాన్ని మనం స్కిప్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్ లో మొదట్లో ఒక్కటే యాడ్ వస్తోంది. కానీ నెమ్మదిగా వాటిని పెంచునుందిట. మధ్యలో కూడా యాడ్స్ వచ్చేలా చర్యలు తీసుకుంటోందిట. వీటిని స్కిప్ అయితే చేసుకోవచ్చు కానీ పూర్తిగా రాకుండా ఆపేయలేము. దీనికి కూడా పరిష్కారం చూపిస్తోంది అమెజాన్ ప్రైమ్. యాడ్స్ ప్రీ కంటెంట్ చూడాలంటే నెలవారీ చెల్లిస్తున్నది కాకుండా అదనంగా మరికొంత చెల్లిస్తే ప్రకటనలు రావు అని చెబుతోంది.

ఓటీటీలు బాగా పాపులర్ అవడంతో…ఇవి తమ చందాదారులను పెంచుకోవడమే కాకుండా వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే యాడ్స్ ను ఇవ్వడం, పాస్ వర్డ్ షేరింగ్ ను పరిమితం చేయడం లాంటివి చేస్తున్నాయి. ప్రస్తుతం భాట్ స్టార్, అమెజాన్ యాడ్స్ బాట పట్టాయి. తొందరలోనే నెట్ ఫ్లిక్స్ కూడా ఇదే పని చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతానికి ఇండియాలో అమెజాన్ ప్రైమ్ టాప్ లో ఉంటే…యూఎస్ ఓటీటీల్లో నెట్ ఫ్లిక్స్ నెం.1 లో ఉంది.

 

khalisthan:భారత్ తో పెట్టుకుంటే దెబ్బ మామూలుగా ఉండదు…

Published on September 23, 2023 5:39 pm by Manogna alamuru

భారత్-కెనడాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇండియాకు కెనడాతో ఉన్న సంబంధాలు దాదాపుగా తెగిపోతున్నాయి. కెనడా ప్రధాని ట్రుడో ఖలిస్థాన్ ఉగ్రవాది విషయంలో చేసిన ఆరోపణలను భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో కెనడాలోని హిందువులంతా ఇండియాకు వెళ్ళిపోవాలని ఖలీస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ వార్నింగ్ ను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అందుకే అమృత్ సర్ జిల్లా ఖాన్ కోట్ లో ఉన్న అతని వారసత్వ వ్యవసాయ భూమిని, ఛండీగఢ్ లో ఉన్న ఇల్లును ఎన్ఐఏ సీజ్ చేసింది. ఇక మీదట అవి ప్రభుత్వానివి అని ప్రకటించింది.

నిజానికి గురపత్వంత్ సింగ్ పేరిట ఉన్న ఆస్తులను 2020లోనే అటాచ్ చేసింది భారత ప్రభుత్వం. అప్పటి నుంచి ఆస్తుల కోసం కెనడా లీగల్ సెల్ గ్రూప్ ద్వారా అతను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఎన్ఐఏ చర్యతో పూర్తిస్థాయి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చేసినట్లయింది. మరోవైపు గురుపత్వంత్ మీద పంజాబ్ లో 22 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అందులో మూడు దేశద్రోహం కేసులు కూడా ఉన్నాయి.

gurupatwanth, NIA

కెనడాలో ఉంటున్న గురుపత్వంత్ ను ఉగ్రవాది అని భారత ప్రభుత్వం 2020లోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. అతని కోసం ఇంటర్ పోల్ కు రెడ్ నోటీస్ సైతం విజ్ఞప్తి చేసింది. కానీ సరైన సమాచారం లేదనే కారణంగా ఇంటర్ పోల్ దానిని తోసిపుచ్చింది. అప్పటి నుంచి గురుపత్వంత్ గురించి ఇండియా…కెనడాను హెచ్చరిస్తూనే ఉంది. కానీ ఆ దేశం మాత్రం సరిగ్గా స్పందించలేదు.

భారత్ కే మా సపోర్ట్…

మరోవైపు కెనడా-భారత్ ల మధ్య ఉద్రిక్తతల మద మిత్ర దేశం అమెరికా ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది. మొదటి నుంచి కెనడా ప్రధాని ట్రుడో చేసిన ఆరోపణలను అమెరికా ప్రభుత్వం ఖండిస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఈ విషయం గురించి మాట్లాడుతూ…రెండు దేశాలు తమకు ముఖ్యమైనవే అయినా..ఒకవైపే నిలబడాల్సి వస్తే భారత్ వైపే ఉంటామని తేల్చి చెప్పారు వైట్ హౌస్ అధికారులు. భారత్ లాంటి బలమైన దేశాన్ని సవాలు చేయడం అంత మంచి విషయం కాదని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 

 

  • Go to page 1
  • Go to page 2
  • Go to page 3
  • Interim pages omitted …
  • Go to page 19
  • Go to Next Page »

Primary Sidebar

INDvsAUS: రెండో వన్డేలో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్.. 2-0తో సిరీస్ కైవసం

INDvsAUS: రెండో వన్డేలో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్.. 2-0తో సిరీస్ కైవసం

Rajaiah: మరో బాంబ్ పేల్చిన రాజయ్య.. కడియంకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు

Rajaiah: మరో బాంబ్ పేల్చిన రాజయ్య.. కడియంకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు

Chandrababu: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

Chandrababu: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

Chandrababu: బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం వెనక రాజకీయ కారణం ఉందా..?

Chandrababu: బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం వెనక రాజకీయ కారణం ఉందా..?

IND vs AUS :  వర్షం కారణంగా  మ్యాచ్‎కు అంతరాయం...నిలిచిపోయిన ఆట..!!

IND vs AUS : వర్షం కారణంగా మ్యాచ్‎కు అంతరాయం…నిలిచిపోయిన ఆట..!!

PM Modi Mann ki Baat : చంద్రయాన్-3, జీ-20తో ప్రపంచం భారత్ వైపు చూస్తోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!!

PM Modi Mann ki Baat : చంద్రయాన్-3, జీ-20తో ప్రపంచం భారత్ వైపు చూస్తోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!!

VandeBharat Express : తెలుగు రాష్ట్రాలకు మోదీ కానుక..ఒకేసారి రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని..!!

VandeBharat Express : తెలుగు రాష్ట్రాలకు మోదీ కానుక..ఒకేసారి రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని..!!

వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న డీజిల్, పెట్రోల్ ధరలు..!!

వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న డీజిల్, పెట్రోల్ ధరలు..!!

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online