Bangladesh: బంగ్లాదేశ్ లో ఎన్సీపీ ర్యాలీలో హింస..నలుగురు మృతి

బంగ్లాదేశ్ లోని గోపాల్ గంజ్ లో ఎన్సీపీ నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. షేక్ హసీనాకు చెందిన మద్దతుదారులు గొడవ చేయడంతో ఘర్షణలు చెలరేగాయి. ఇందులో నలుగురు మృతి చెందారు. మరో తొమ్మది మంది గాయపడ్డారు.

New Update
ncp rally

Curfew After Bangladesh NCP rally

బంగ్లాదేశ్ లో మళ్ళీ హింస చెలరేగింది. ఎన్సీపీ, షేక్ హసీనా మద్దతుదారులకు మధ్య మొదలైన గొడవ తీవ్రంగా మారి ఘర్షణలకు దారితీసింది. గోపాల్ గంజ్ లో నేషనల్ సిటిజన్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. విద్యార్థుల నేతృత్వంలో ఇది జరిగింది. ఇందులో విద్యార్థి సంస్థలు ముజీబ్ వారసత్వం తొలిగించడంపై మాట్లాడుతుండగా..షేక్ హసీనా మద్దతుదారులు గొడవ చేశారు. ఇది కాస్తా పెద్ది అయి హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు నలుగురు మృతి చెందారు. వీరిలో 25 ఏళ్ళ డిప్టో సాహా, 18 ఏళ్ళ రంజాన్ కాజీ ఉన్నారు. వీరిద్దరినీ కాల్చి చంపారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. 

22 గంటల కర్ఫ్యూ..

ఘర్షణల తర్వాత గోపాల్ గంజ్ లో 22 గంటల కర్ఫ్యూను విధించారు. అక్కడ 200 మంది ఎక్కువ పారామిలటరీ దళాలను మోహరించారు. గోపాల్ గంజ్ షేక్ హసీనా, ఆమె తండ్రి ముజిబుర్ రెహమాన్ రాజకీయ స్థావరం. ఇక్కడ ఆ పార్టీకి పట్టు ఎక్కువ. మరోవైపు ఎన్సీపీ శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీని నిరోధించడం యువత రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహ్మద్ యూనస్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ గొడవల వెనుక నిషేధిత అవామీ లీగ్ విద్యార్థి విభాగం, స్థానిక నాయకులు ఉన్నారని ఆరోపించింది.  ఇలాంటి దాడులను సహించమని..దోషులు ఎవరైనా త్వరలోనే శిక్షింపబడతారని చెప్పింది. 

Also Read: USA: అలా చేస్తే వీసాలు క్యాన్సిల్..యూఎస్ ఎంబసీ వార్నింగ్

Advertisment
తాజా కథనాలు