Andhra News: అన్నమయ్య జిల్లా లో తీవ్ర విషాదం..వరదల్లో కొట్టుకుపోయిన చిన్నారి..పలువురు మృతి
అన్నమయ్య జిల్లాను వర్షాలు అతలాకుతలం చేశాయి. జిల్లావ్యాప్తంగా కురిసిన కుంభవృష్టితో రాయచోటిలో విషాదం నెలకొంది. పట్టణంలో కురిసిన భారీ వర్షానికి వరద పోటెత్తింది. ఆ వర్షపునీటిలో నలుగురు కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురు మృతిచెందగా. ఒక చిన్నారి ఆచూకీ లభించలేదు.