Nagababu : నేను నాస్తికుడిని కాదు, సనాతన హిందువును.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

తాను ఒక సగటు భారతీయుడిని, హిందువుని అని తాను పరమాత్మను నమ్ముతానని జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు హిందువు అనేది నమ్మకమో.. మతమో కాదని ఇది ఒక ధర్మం అని అన్నారు. ఇది ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ అని చెప్పారు.

New Update
Nagababu Janasena MLC Candidate

Nagababu Janasena MLC

Nagababu : తాను ఒక సగటు భారతీయుడిని, హిందువుని అని తాను పరమాత్మను నమ్ముతానని జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు హిందువు అనేది నమ్మకమో.. మతమో కాదని ఇది ఒక ధర్మం అని అన్నారు. ఇది ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ అని చెప్పారు. ఈ దేశంలో పుట్టిన ప్రతిఒక్కరు హిందువేనని ఇక్కడ చార్వాకులకు కూడా చోటు ఉంది కాబట్టి తాను హిందువునే అని స్పష్టం చేశారు. తన ధర్మాన్ని గౌరవిస్తూ.. ఇతరుల విశ్వాసాలను కించపర్చకుండా బతుకుతున్నా కాబట్టి ప్రౌడ్ సనాతని హిందువునని నాగబాబు చెప్పుకున్నారు. అందుకే తాను ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెట్టిన తొలిసారే అర్చకుల జీతాలు పెంచాలని కోరినట్టు వివరించారు.

 2020లో అంతర్వేదిలో రథం దగ్ధమైనరోజు రాష్ట్రవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని నాగబాబు అన్నారు. ఆ రోజు  వైసీపీ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగిస్తామని చెప్పిందని గుర్తు చేశారు. కానీ సీబీఐ ఆ కేసును ఇంతవరకు టేకప్ చేయలేదని చెప్పిందన్నారు. వైసీపీ వాళ్లకు ఇతరుల పర్సనల్ విషయాలపై ఉన్న ఆసక్తి ప్రజలపై ఉండదని ఎద్దేవా చేశారు. 2020లోనే రామతీర్థం రాముడి శిరస్సును తీసేసినా వైసీపీ పట్టించుకోలేదని ఆరోపించారు. ఆ కేసును కూడా నీరుగార్చారన్నారు. 2024 జనవరి 24లో అయోధ్య రామమందిరం నిర్మించుకున్నామని ఈ సందర్భంగా పవన్, చంద్రబాబు వెళ్లి అయోధ్యలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు.

 కానీ, ఈ విషయమై జగన్ ఒక ట్వీట్ కూడా వేయలేదని అన్నారు. అంతేకాకుండా టీటీడీలో అకామిడేషన్ ఛార్జీలు పెంచి సామాన్యుడికి దేవుడిని దూరం చేశారన్నారు. తిరుమలపై దోపిడీ అంతా ఇంతా కాదన్నారు. బాధ్యత గురించి వైసీపీ వాళ్లకు చెప్పడం చెవిటోడి ముందు శంఖం ఊదినట్టేనని అన్నారు. పవన్ తిరుమల దర్శనానికి తన కూతురుకు డిక్లరేషన్ ఇప్పించారని, అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చే వెళ్లారని అన్నారు. నువ్వు కలాం కంటే గొప్పోడివా అంటూ జగన్ ను నాగబాబు తీవ్రంగా ప్రశ్నించారు. డిక్లరేషన్ అడిగారని తిరుమల పర్యటన రద్దు చేసుకున్న చరిత్ర నీది అంటూ మండిపడ్డారు.  

Advertisment
తాజా కథనాలు