/rtv/media/media_files/2026/02/02/fotojet-25-2026-02-02-19-31-35.jpg)
Travel Scam
Travel Scam : ఆధ్యాత్మిక యాత్రల పేరుతో పర్యాటకులను విదేశాలకు తీసుకుపోయి అక్కడే వారిని వదిలేసి వచ్చిన ఒక ట్రావెల్ ఏజెన్సీ మోసం కడప జిల్లాలో వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కడప నగరానికి చెందిన 'గో న్యూ హాలిడేస్(Go New Holidays)' అనే ట్రావెల్ ఏజెన్సీ రామేశ్వరం, శ్రీలంక టూర్ ప్యాకేజీల పేరుతో అమాయకులైన పర్యాటకులను నమ్మించింది. వారి నుంచి భారీ వసూళ్లకు పాల్పడి.. తీరా అక్కడికి తీసుకెళ్లాక పర్యాటకులను నిండా ముంచింది.
కడప కేంద్రంగా గో న్యూ హాలిడేస్ అనే పేరుతో ఉదయ భాస్కర్ అనే వ్యక్తి ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్నాడని బాధితులు తెలిపారు. ఆయన విదేశీ పర్యటన పేరుతో ఒక్కో పర్యాటకుని వద్ద సుమారు రూ.60 వేలు వసూలు చేశాడు. రామేశ్వరం, శ్రీలంక టూర్ ప్యాకేజీని ఖరారు చేశారు. శ్రీలంకలో తమ ప్రతినిధి రిసీవ్ వారిని చేసుకుంటాడని.. వసతి, భోజన సౌకర్యాలున్నీ తామే చూసుకుంటామని వారందరిని నమ్మించాడు. అలా బెంగళూరు నుంచి 11 మంది, హైదరాబాద్ నుంచి 40 మంది పర్యాటకులు డబ్బులు చెల్లించి పర్యటనకు వెళ్లారు. అయితే తీరా శ్రీలంకకు వెళ్లాక అక్కడ వారిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. దీంతో మోసపోయామని గ్రహించిన పర్యాటకులు ప్రస్తుతం అక్కడి లోకల్ ట్రావెల్ సంస్థల సాయంతో ఆశ్రయం పొందుతున్నట్లు బాధితులు తెలిపారు.
ప్రస్తుతం శ్రీలంకలోనే చిక్కుకున్న పర్యాటకులు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ నెల 6న తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేశారని.. అయితే నిందితుడైన ఉదయభాస్కర్ వాటిని ఎక్కడ రద్దు చేస్తాడోనని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి.. తాము సురక్షితంగా ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.కాగా విదేశీ టూర్ పేరుతో ‘గో న్యూ హాలిడేస్’ ట్రావెల్ ఏజెన్సీ చేసిన మోసం స్థానికంగా కలకలం రేపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఉదయభాస్కర్ అనే వ్యక్తిపై ఏపీ ప్రభుత్వం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Follow Us