Crime : భార్య వివాహేతర సంబంధం..గొంతుకోసి చంపిన భర్త

ఐదేళ్లక్రితం పెళ్లిచేసుకున్న ఒక జంట మధ్యలో మరో వ్యక్తి రావడంతో గొడవలు మొదలయ్యాయి. భార్య వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగి దూరమయ్యారు. ఈ క్రమంలోనే గొడవలు ఎక్కువై భార్యను గొంతుకోసి చంపాడు. కాగా నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
five members of same family found dead under suspicious circumstances in hyderabad

Husband strangled wife to death for having extramarital affair

 Crime : ఐదేళ్లక్రితం పెళ్లిచేసుకున్న ఒక జంట మధ్యలో మరో వ్యక్తి రావడంతో గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలతో భార్యభర్తల మధ్య వివాదం చెలరేగి దూరమయ్యారు. ఈ క్రమంలోనే గొడవలు ఎక్కువై భార్యను గొంతుకోసి చంపాడు.మూడ్రోజుల క్రితం వివాహిత హత్య కేసులో భర్తను బాలాజీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు దారి తీసిన పరిస్థితులను ఇన్‌స్పెక్టర్‌ సాంబశివరావు వెల్లడించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నెల్లూరు గ్రామీణ మండలం చిన్నచెరుకూరుకు చెందిన శ్రీనందిని (24)కి నెల్లూరు కోటమిట్టకు చెందిన శ్రీహరితో అయిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఇదిలా ఉండగా నందిని తన చిన్ననాటి స్నేహితుడు సుభాష్‌ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.  

శ్రీనందిని ఆమె చిన్ననాటి స్నేహితుడు సుభాష్‌తో కొనసాగిస్తు్న్న వివాహేతర సంబంధంపై ప్రవర్తన మార్చుకోవాలని భర్త శ్రీహరి పలుమార్లు చెప్పి చూశాడు. కానీ ఆమె తన పద్దతి మార్చుకోకపోవడంతో తరచూ గొడవలు ఎక్కువయ్యాయి. దీంతో ఆమె నెల్లూరుపాలెంలో తన తల్లి వద్దకు వెళ్లిపోయింది. ఇదే క్రమంలో మూడు నెలల క్రితం శ్రీనందిని, సుభాష్‌తో కలిసి మైపాడు బీచ్‌లో ఉండగా భర్త శ్రీహరి వారిద్దరిని రెడ్‌ హ్యాండేడ్‌గా పట్టుకున్నాడు. ఈ క్రమంలో అక్కడ వారి మధ్య గొడవ జరిగి వ్యవహారం చిన్నబజారు పోలీసు స్టేషన్‌కు చేరింది. అయితే పోలీసులు ఆ సమయంలో వారిని మందలించి వదిలేశారు.

ఇదిలా ఉండగా శ్రీనందిని మూడు నెలల క్రితం బెంగళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అప్పటి నుంచి భర్త  శ్రీహరి ఆమెతో ఫోనులో మాట్లాడసాగాడు. అయితే శుక్రవారం రాత్రి నందిని నెల్లూరు వస్తున్నానని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దానికి బదులుగా శ్రీహరి బస్సు వద్దకు వస్తానని చెప్పాడు. నెల్లూరుపాలేనికి వెళ్లేందుకు బస్సు ఎక్కిస్తానని చెప్పి తన స్కూటీపై ఎక్కించుకుని స్థానికంగా ఉన్న చిన్నపిల్లల పార్కు ఎదురుగా ఖాళీ స్థలానికి తీసుకు వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరగగా అంతకు ముందే తనతో తెచ్చుకున్న కత్తితో నందిని గొంతు కోసి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బాలాజీనగర్ పోలీసులు నిందితుడు శ్రీహరిని సోమవారం అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు