/rtv/media/media_files/2026/02/01/ambati-2026-02-01-06-32-47.jpg)
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులో జరిగిన ఫ్లెక్సీల వివాదం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపాయి.
అంబటి రాంబాబు అరెస్ట్…
— Lalkrishna SARPANCH (@GundlapalliLal1) January 31, 2026
అరెస్ట్ సమయంలో కోడి గుడ్లతో కొట్టిన మహిళలు....
కుక్కల వ్యాన్ లో ఊరకుక్క తరలింపు🤣🤣#ambatirambabupic.twitter.com/n6AWqdrkIK
గుంటూరులో ఫ్లెక్సీల విషయంలో జరిగిన గొడవలో అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. అంబటి వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన, బీజేపీ (కూటమి) కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి. గుంటూరు నవభారత్ నగర్‌లోని అంబటి రాంబాబు ఇంటిని టీడీపీ నేతలు, కార్యకర్తలు ముట్టడించారు.
అంబటి ఇంటిపై రాళ్లు రువ్వడంతో
దాదాపు 6 గంటల పాటు అక్కడ ఉద్రిక్తత కొనసాగింది. ఆందోళనకారులు అంబటి ఇంటిపై రాళ్లు రువ్వడంతో పాటు, అక్కడ ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి చెప్పులు, చీపుర్లతో తమ నిరసనను వ్యక్తం చేశారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి బలవంతంగా పంపించివేసి, భారీ భద్రత మధ్య అంబటి రాంబాబును అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అంబటి అరెస్ట్‌తో గుంటూరులో హై అలర్ట్ ప్రకటించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబటి రాంబాబుని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం మ్యాజిస్ట్రేట్ పొందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
గుంటూరు పోలీసులు అంబటి రాంబాబుపై రెండు ఎఫ్ఐఆర్ (FIR) లు నమోదు చేశారు.ఆన్ డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందిని ఇబ్బంది పెట్టడం, ఒక సబ్-ఇన్ స్పెక్టర్ (SI)ను నెట్టేయడం వంటి ఆరోపణలపై ఒక కేసు నమోదైంది. సీఎంపై రెచ్చగొట్టేలా మాట్లాడటం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారనే ఆరోపణలపై రెండో కేసు నమోదైంది.
అంబటి రాంబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన భార్య విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తూ పోలీసులపై పలు ఆరోపణలు చేశారు.
Follow Us