AP Cabinet Meeting: టీటీడీ నెయ్యి కల్తీకి వైసీపీ ప్రభుత్వమే కారణం..ఆధారాలివిగో : పయ్యావుల

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్నఆరోపణలపై మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన విషయాలు వెల్లడించారు.

New Update
FotoJet (2)

Payyavula Keshav: ఏపీ క్యాబినెట్‌ భేటీ(ap-cabinet-meet) ముగిసింది. కాగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం(ap-cabinet-key-decisions) తీసుకుంది. అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మూడు గంటలపాటు కొనసాగిన క్యాబినెట్‌ భేటీలో సిట్‌ నివేదికపైనా చర్చ జరిగింది. ఆ నివేదికలో పాత్రధారులపైనే చర్యలకు సిట్‌ సిఫార్సు చేసిందని అభిప్రాయపడింది. సిట్‌ విచారణ, ఛార్జ్‌షీట్‌, ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలను మంత్రివర్గం గుర్తించింది. ఈ మూడింటిపై అధ్యయనం చేసి వాస్తవాల సమర్పణకు కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విచారణలో ఉన్న వాస్తవాలు ఛార్జ్‌షీట్‌లో ఎందుకు నమోదు చేయలేదనే దానిపై సమావేశంలో చర్చ జరిగింది.

కాగా  మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై మంత్రి పయ్యావుల కేశవ్‌(payyavula-keshav) వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ  తిరుమల లడ్డూ ప్రసాదం(tirupathi laddu scam) తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కల్తీ వ్యవహారానికి పునాది వేసింది గత వైసీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే టీటీడీ నెయ్యి సరఫరా నిబంధనలను అనర్హులకు అనుకూలంగా మార్చారని పయ్యావుల ఆరోపించారు. గతంలో సరఫరాదారులకు ఉండాల్సిన రూ.250 కోట్ల టర్నోవర్‌ను రూ.150 కోట్లకు, మూడేళ్ల అనుభవాన్ని ఏడాదికి తగ్గించి కల్తీకి తలుపులు తెరిచారని ఆరోపించారు. 2022లోనే నెయ్యి నాణ్యతపై అనుమానంతో మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CFTRI)కి పంపగా, అందులో జంతు అవశేషాలున్నట్లు నివేదిక వచ్చిందని వివరించారు. కానీ, నాటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆ నివేదికను తొక్కిపెట్టి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. తిరుమలలో ఇన్ని తప్పులు జరుగుతుంటే గత ప్రభుత్వ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారని పయ్యావుల ప్రశ్నించారు. ఈ తప్పుల్లో వారు భాగస్వాములుగా ఉన్నారని ఆధారాలు చెబుతున్నాయన్నారు. 

Also Read :  పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై!

YSRCP Government Is Responsible For TTD Ghee Adulteration

ఇక తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని మంత్రి తెలిపారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.240 కోట్ల అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. నాటి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న ఈ కల్తీ కథలో కీలక వ్యక్తి అని, అతడు లీటరుకు రూ.25 చొప్పున లంచం డిమాండ్ చేసినట్లు సిట్ నివేదిక స్పష్టం చేసిందని పేర్కొన్నారు. చిన్న అప్పన్న ఖాతాకు నేరుగా రూ.4 కోట్లు బదిలీ అయ్యాయని, దీని వెనుక ఉన్న పెద్ద తలలు ఎవరో తేలాల్సి ఉందన్నారు.

 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో టీటీడీ ప్రక్షాళన చేపట్టామని పయ్యావుల వివరించారు. నెయ్యి నమూనాలను నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB)కు పంపగా, అందులో జంతువుల కొవ్వు కలిసినట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. సిట్ చార్జ్‌షీట్‌లోని 35వ పేజీలో కూడా ఈ విషయం స్పష్టంగా ఉందని చెప్పారు.  లడ్డూల్లో కొబ్బరి, పందికొవ్వు, పామాయిల్‌, ఫిష్‌ ఆయిల్‌ ఉన్నట్టు ఎన్‌డీడీబీ నివేదిక ఇచ్చింది. ల్యాబ్‌ నివేదికలోని సమాచారం ప్రకారమే సీఎం మాట్లాడారన్నారు.తితిదే ప్రక్షాళనలో భాగంగా ఈవోగా శ్యామలరావును నియమించారు. నమూనాలను సీఎఫ్‌టీఆర్‌ఐకి అప్పటి ఈవో పంపించారు. 2022లో నివేదిక ఇస్తే దాన్ని సరిచేయకుండా పాలకులు ముందుకెళ్లారన్నారు. పాలసేకరణలో 3 నిబంధనలు పెట్టారు. 4లక్షల లీటర్ల పాలు సేకరించే సంస్థగా ఉండాలని నిబంధన ఉంది. సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న భోలే బాబా డెయిరీకి వెళ్లారు. నకిలీ పత్రాలతో టెండర్లలో పాల్గొన్నారని తెలిసినా మౌనం వహించారు. చుక్కపాలు లేకుండా నెయ్యి చేయడంపై ప్రజల్లో చర్చ జరగాలి. నేరంలో భాగస్వాములపై చర్యలు తీసుకునేందుకే విచారణ కమిషన్‌. బ్రిటీష్‌ పాలకులు, నిజాం కూడా తిరుమల వ్యవస్థలోకి చొరబడలేదు’’ అని పయ్యావుల అన్నారు. ఇంత స్పష్టమైన నివేదికలు ఉండగా, వైసీపీ నేతలు తమకు క్లీన్‌చిట్ వచ్చిందంటూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.

తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో పారదర్శత కోసమే ప్రభుత్వ ప్రయత్నం తప్ప.. రాజకీయ కోణం ఇందులో లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తిరుమల శ్రీవారి పవిత్రత కాపాడే ప్రయత్నమే కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు. తిరుమల లడ్డూలో కల్తీని వైకాపా సమర్థిస్తోందా అని  వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశ్నించారు. 250కోట్ల అవినీతి కోసం భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. హిందూధర్మం మూలాలను దెబ్బతీసే విధంగా వైసీపీ చర్యలు ఉన్నాయని దుయ్యబట్టారు.

Also Read :  విద్యార్థినాయకుల కిడ్నాప్‌.. వరుస వివాదాల్లో మోహన్‌బాబు.. కేసునమోదు

Advertisment
తాజా కథనాలు